
సెప్టెంబర్ 1 నుంచి నిర్వహణకు సన్నద్ధం
నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ప్రదర్శన
2020-21 సంవత్సరానికి ఉమ్మడి జిల్లా నుంచి 308 ప్రదర్శనలు ఎంపిక
సూర్యాపేట జిల్లా నుంచి 48, యాదాద్రి నుంచి 43 మాత్రమే
రామగిరి, ఆగస్టు 27: విద్యార్థుల్లో శాస్త్రీయ నైపుణ్యాలను వెలికి తీసేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ‘ ఇన్స్పైర్-మానక్ వైజ్ఞానిక ప్రదర్శన’ ను నిర్వహిస్తున్నారు. కాగా ప్రత్యేక్షంగా జరగాల్సిన ఈ ప్రదర్శన కరోనా నేపధ్యంలో వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఆన్లైన్లో జూమ్‌యాప్, గూగుల్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) నిర్వహణకు సన్నద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సెప్టెంబర్ 1వతేదీ నుంచి 20వతేదీ వరకు ఈ ప్రదర్శన ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటుండటంతో ఎంపికైన విద్యార్థులంతా ప్రాజెక్టును ఈనెల 30లోగా తయారుచేసి సహాయ ఉపాధ్యాయులతో సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ సూచిస్తోంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సామాజిక అంశాలతో పాటు పరిసరాల సమస్యలను గుర్తించి నూతన ఆవిష్కరణలను చేసే విధంగా భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఇన్స్పైర్-మానక్ అవార్డ్సుతో నిధులను అందిస్తున్నది. దాంతో ఆ విద్యార్థి ఆ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడంతో బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం. 2020-21 విద్యా సంవత్సరం కోసం నల్లగొండ జిల్లా నుంచే అత్యధికంగా ప్రాజెక్టులు 308 ఎంపికావడంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే విధంగా సూర్యాపేట జిల్లా నుంచి 48, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 43 మాత్రమే అవకాశం దక్కింది. వీరంతా వచ్చే నెలలో నిర్వహించే ఆన్లైన్ ప్రదర్శనలో ఆయా అంశాల్లో తయారుచేసిన ప్రాజెక్టులను ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఎంపిక ఇలా….
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించారు. వీరిలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు అర్హులు. 10 నుంచి 15 సంవత్సరాలు లేదా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తరగతికి ఒక ప్రాజెక్టు చొప్పున తమ ఆలోచనలతో తయారు చేయాలి. అందుకు సహకరించిన గైడ్ టీచర్‌తో వాటిని ఆన్లైన్లో సమర్పించాలి. ప్రాజెక్టు తయారీకి రూ. 10 వేలను విద్యార్థి అకౌంట్లో జమచేస్తారు. దాంతో ప్రాజెక్టును తయారు చేయాలి. ప్రతి విద్యార్థికి ఇందుకు సంబంధించి 2020-21 ప్రక్రియ పూర్తి కాగా మార్చిలో ఈ ప్రదర్శన జరగాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. దాన్ని ఆన్లైన్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
జిల్లా స్థాయిలో విజేతలైతే రాష్ట్రం,
అక్కడి నుంచి జాతీయస్థాయికి …
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించారు. వీరిలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు అర్హులు. 10 నుంచి 15 సంవత్సరాలు లేదా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తరగతికి ఒక ప్రాజెక్టు చొప్పున తమ ఆలోచనలతో తయారు చేయాలి. అందుకు సహకరించిన గైడ్ టీచర్‌తో వాటిని ప్రదర్శించాల్సి ఉంది. ప్రాజెక్టు తయారీకి రూ. 10 వేలను విద్యార్థి అకౌంట్లో జమచేస్తారు. 2020-21 ప్రక్రియ పూర్తి కాగా వాటి ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్ర స్థాయిలో 3813 ప్రాజెక్టులు ఎంపికగా నల్లగొండ జిల్లా నుంచే అత్యధిక 308 ప్రాజెక్టులు ఎంపిక కావడంతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా స్థాయిలో మంజూరైన ప్రాజెక్టుల్లో పది శాతం రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కనున్నది. ఒక్కోజాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20 వేల నగదు పురస్కారం దక్కనున్నది. అంతేగాకుండా రాష్ట్రపతి భవన్లో ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన పరిశోధన కేంద్రాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి వెళ్లాలి
విద్యారుల్లో సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ఇన్స్పైర్-మానక్ వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశం. జిల్లా నుంచి ఈ పర్యాయం అన్ని పాఠశాలల నుంచి నల్లగొండ జిల్లాలో 308, సూర్యాపేట జిల్లాలో 48మంది విద్యార్థుల ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. వీరికి ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1నుంచి కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో ప్రదర్శనను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు వారి వారి గైడ్ టీచర్లు తెలియజేసి ప్రాజెక్టుతో పాటు అందుకు సంబంధించిన రిపోర్టుతో సంసిద్ధంగా ఉండాలని సూచించాం. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలు రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపి జాతీయస్థాయికి వెళ్లి జిల్లాల ఖ్యాతి చాటాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశగా గైడ్ టీచర్స్ విద్యార్థులకు సహకరించి ప్రోత్సహించి ఉత్తమ ప్రదర్శనలు ఇప్పించాలి.
-బి. భిక్షపతి, డీఈవో, నల్లగొండ, సూర్యాపేట
ఆన్లైన్లో ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలి
ఇన్స్పైర్-మానక్ ప్రదర్శన అవార్డులు 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 3813 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా వాటిలో నల్లగొండ జిల్లా నుంచి 308 ప్రాజెక్టులు ఎంపికైనవి. దీంతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో మన జిల్లానే నిలువడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా ఉన్నత స్థానం సాధించడానికి ప్రధాన భూమిక పోషిస్తూ తగిన సూచనలు అందించిన డీఈవో బి.భిక్షపతికి పర్యవేక్షణ, సూచనలతో ముందుకుసాగుతున్నాం. అయితే కరోనా నేపథ్యంలో ఈ పర్యాయం ఇన్స్పైర్ -మానక్ ప్రదర్శనను ఎస్సీఈఆర్టీ నిర్వహణ చేస్తుంది. అందుకు సంబంధించి విధివిధానాలు సహితం ఖరారుచేసింది. ఈనెల 30లోగా విద్యార్థులు తమ ప్రాజెక్టులను తయారుచేసి సిద్ధంగా ఉండాలి. ఇతర సమాచారం కోసం సెల్: 9848578845 నంబర్లో సంప్రదించాలి.
-వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ