
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు ..
శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం
యాదాద్రి, ఆగస్టు 22 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతం స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు నిజాషేకాలతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభించారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణతంతును వీక్షించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు భారీగా జరిగాయి. భక్తులు వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి ఖజానాకు రూ.11,66,094 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ.6,100, వీఐపీ దర్శనాలతో రూ.90,000, సుప్రభాతం ద్వారా రూ.1,800, క్యారిబ్యాగులతో రూ.6,500, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ.93,500, కల్యాణకట్టతో రూ.19,000, ప్రసాద విక్రయంతో రూ.5,13,900, వాహనపూజలతో రూ. 12,800, టోల్గేట్తో రూ.920, అన్నదాన విరాళంతో రూ.9,748, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,14,560, యాదరుషి నిలయంతో రూ.70,440, పాతగుట్టతో రూ. 30,060తో కలుపుకుని రూ.11,66,094 ఆదాయం సమకూరినట్లు ఆమె
తెలిపారు.