
వైభవంగా స్వామివారికి నిజాభిషేకం
శ్రీవారి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తులు కోలాహలం మధ్య నిర్వహించారు. బాలాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ. 516 టికెట్ తీసుకున్న భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
శ్రీవారి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం
యాదాద్రి, ఆగస్టు20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయం త్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను మహి ళా భక్తుల కోలాహలం మధ్య వైభవంగా నిర్వహించారు. లక్ష్మీదేవిని విశేష పుష్పాలతో అలంకరిం చారు. బాలాలయ ముఖమండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.516 టికెట్ తీసుకున్న భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బం గారంతో తయారుచేసిన 108 పుష్పాలను స్వా మి వారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని బాలాలయ ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకా ల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజ ల్లో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
యాదాద్రి స్వామివారికి అర్చకులు నిజాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజా ము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి ఖజానాకు రూ.8,52,762 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.8,52,762 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,15,604, రూ.100 దర్శనంతో రూ.21,000, వీఐపీ దర్శనాలతో రూ.9,150, సుప్రభాతంతో రూ.400, క్యారీబ్యాగులతో రూ.2,200, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.74,000, కల్యాణకట్టతో రూ. 16,600, ప్రసాద విక్రయంతో రూ.3,58,140, శాశ్వత పూజలతో రూ.7,116, వాహన పూజలతో రూ.9,400, టోల్గేట్తో రూ.1,110, అన్నదాన విరాళంతో రూ.2,833, సువర్ణ పుష్పార్చనతో రూ.57,180, యాదరుషి నిలయంతో రూ.52,920, పాతగుట్టతో రూ.15,925, టెంకాయల విక్రయంతో రూ.38,220, ఇతర విభాగాలతో రూ.70,965తో కలుపుకొని రూ. 8,52, 762 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
ఆలయానికి
రంగుల పూలతో అలంకరణ
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయాన్ని వివిధ రకాల రంగుల పూలతో శుక్రవారం అలంకరించారు. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడి సహకారంతో స్వామివా రి గర్భాలయం, అష్టోత్తర మండపం, కల్యాణ మండపాలతోపాటు బాలాలయ గోడలను రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు.
24న రాజరాజేశ్వరి దేవి
విగ్రహ ప్రతిష్ఠాపన
భువనగిరి అర్బన్, ఆగస్టు20: పట్టణ పరిధిలోని మాస్కుకుంట సమీపంలో గల ఆంజనేయస్వామి , రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 24వ తేదీన రాజరాజేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్గౌడ్ తెలిపారు.