
రాజాపేట, సెప్టెంబర్ 2 : భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన హిమ బిందు మృతదే హం నాలుగోరోజు ల భ్యమయ్యింది. ఈ సం ఘటనలో ఇద్దరు యు వతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా గల్లంతైన బొందుగులకు చెందిన యువతి హిమబిందు కోసం ఫైర్ సిబ్బంది, రెవెన్యూశాఖ, పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా పాముకుంట దోసర వాగులో గురువారం గాలిస్తుండగా పారుపల్లి రోడ్ డ్యాం సమీపంలో చెట్ల పొదల్లో యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు దవాఖానకు తరలించారు. కార్యక్రమంలో సీఐ నర్సయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.