
బషీరాబాద్, ఆగస్టు 13 : సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొర్విచేడ్గని గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి సహకారంతో తాండూరు నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు విఠల్‌నాయక్, అరుణ, వైస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్ సునీత, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులున్నారు.
నవాల్గా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఉపాధి కోల్పోతామని గ్రామ ప్రజలు, గని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఎవరికీ అన్యాయం జరుగదన్నారు. ఒకవేళ అన్యాయం జరిగితే పార్కును జినుగుర్తి గ్రామంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. అయితే కార్మికులు సంఘంగా ఏర్పడి నాపరాతి రాళ్లను వెలికితీసేందుకు లీజుకు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.