
మహబూబ్‌నగర్, జనవరి 21 : ఆర్టీసీ ప్రయాణికులు నూతన ఆలోచనలకు అనుణంగా అవసరమైన చర్యలు తీ సుకుంటూ ముందుకు సాగుతున్నది. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్, వరంగల్ వరకు ఏస్సీ బస్సులను ఆర్టీ సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏస్సీ బస్సులను అం దుబాటులోకి తీసుకురావడంతో రానున్న వేసవి సమయం లో ఈ బస్సులకు మరింత డిమాండ్ పెరుగుతున్నదని ఆర్టీ సీ అధికారులు భావిస్తున్నారు. మరింత అధికంగా డిమాం డ్ ఉంటే మహబూబ్‌నగర్ నుంచి మరిన్ని ఏసీ బస్సులను సైతం అధికారులు నడిపించే అవకాశం ఉంది. ఈ తరుణం లో ఏస్సీ బస్సులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎం తో ఆసక్తి చూపుతుండ్రు.
రోజు ఐదు మార్లు…
మహబూబ్‌నగర్ నుంచి ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ మీదుగా వరంగల్‌కు బస్సు ప్రయాణించనున్న ది. అలాగే మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి ఉదయం 10, 10:30, 5, 5:30 గంటల కు ఏస్సీ బస్సులు హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులను అందుబాటులో ఉంచింది. ఆ ర్టీసీ తీసుకుంటున్న చర్యలు ప్రయాణికులకు మాత్రముగ్ధులని చేస్తున్నాయి. ఆర్టీసీలో వెంట వెంటనే మార్పులు రావడంతో ప్రయాణికులకు పలు సేవలను ఆర్టీసీ అం దుబాటులోకి తీసుకువస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఏ స్సీ బస్సు చార్జీ ఒక్కరికీ రూ.190 చేయ డం జరుగుతున్నది. ప్రయాణికులే ఆర్టీసీకి ఎంతో ముఖ్యమని చెబుతూ ఆర్టీసీ నూతన ఆవిష్కరణలను అంకురార్పణ చేస్తూ అడుగులు వేస్తున్నది.
బస్సులో ప్రయాణం సురక్షితం
ఆర్టీసీ బస్సులో ప్రతిఒక్కరూ ప్రయాణించండి. ఆర్టీసీ ఉన్నదే ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం. ఆ దిశగానే మహబూబ్‌నగర్ నుంచి వరంగల్, హైదరాబాద్ ఏస్సీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగింది.
-అశోక్‌రాజు, డీఎం, మహబూబ్‌నగర్