
భూత్పూర్/మూసాపేట, జనవరి 21 : అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీతోపాటు మూసాపేట మండలకేంద్రంలో ఫీవర్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేసి హోంఐసొలేషన్‌లో ఉంచాలని సూచించారు. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కమిషనర్ నూరుల్‌నజీబ్, తాసిల్దార్లు చెన్నకిష్టన్న, మంజుల, ఎంపీడీవో ఉమాదేవి, ఎన్సీడీ ఆఫీసర్ సంధ్యాకిరణ్మయి, మండల వైద్యాధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటినీ సర్వే చేయాలి
జడ్చర్ల/టౌన్, జనవరి 21 : వైద్యసిబ్బంది ప్రతి ఇం టినీ సర్వేచేసి కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాల ని జెడ్పీ సీఈవో జ్యోతి సూచించారు. శుక్రవారం జడ్చ ర్ల మండలం గంగాపూర్‌లో ఫీవర్ సర్వేను పరిశీలించా రు. అనంతరం పీహెచ్సీలో కొవిడ్ టెస్టింగ్ సెంటర్‌ను పరిశీలించి వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా, జడ్చర్ల మండలంలోని 45 గ్రామపంచాయతీల్లో 47 బృందాలు దాదాపు 2,588 ఇండ్లను సర్వే చేసినట్లు గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ రాహుల్ తెలిపారు. సర్వేలో 113మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్ కిట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే 13మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారికతోపాటు కమిషనర్ సునీత పలు వార్డుల్లో ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో 27 బృందాలుగా ఏర్పడి మొదటిరోజు దాదాపు 4,802 ఇండ్లను సర్వే చేయగా, 74మందికి జ్వరం, దగ్గు, ఒంటినొప్పు లు తదితర లక్షణాలను గుర్తించి వారికి మెడికల్ కిట్లను అందించినట్లు అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. అలాగే 20మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇంటింటి సర్వేతోపాటు పలువురికి కొవిడ్ వ్యా క్సిన్ వేసినట్లు తెలిపారు. బూరెడ్డిపల్లిలో ఇంటింటి సర్వే ను కౌన్సిలర్ ఉమాదేవి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి. మక్తపల్లి శ్రీనివాస్, హైమావతి, చేతనారెడ్డి, నర్సింహులు, సువర్ణ, మాజీ సర్పంచ్ వెంకటేశ్, కరుణాకర్, ఎంపీడీవో జగదీశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అందరూ సహకరించాలి
బాలానగర్, జనవరి 21 : జ్వర సర్వేకు అందరూ సహకరించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ కోరారు. మండలంలోని పెద్దాయపల్లి, శేరిగూడ గ్రామా ల్లో జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరంవంటి లక్షణాలు ఉంటే వైద్యసిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీదేవి, సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి
కోయిలకొండ, జనవరి 21 : జ్వర సర్వేలో ప్రజల ఆరోగ్య పరిస్థితిని పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని ఎంపీడీవో జయరాం సూచించారు. మండలకేంద్రంలో జ్వర సర్వేను పరిశీలించారు. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీవో నసీర్‌అహ్మద్, వీఆర్వో కృష్ణారెడ్డి, నాయకులు జగన్‌గౌడ్, అంగన్వాడీ టీచర్ సత్యమ్మ, ఆశ కార్యకర్త సుష్మా పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్వాడ, జనవరి 21 : కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వర స ర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కా ర్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజగౌడ్, ఎంపీవో వెంకట్‌రెడ్డి, ఏపీఎం సుదర్శన్ ఉన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, జనవరి 21 : మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూర్, కోటకదిర తదితర గ్రామాల్లో జ్వర సర్వేను ముమ్మరంగా నిర్వహించారు. కోటకదిరలో ఎంపీవో నరేందర్‌రెడ్డి పర్యటించి జ్వర సర్వేతోపాటు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీకాంత్‌గౌడ్, మల్లు రమ్యాదేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 21 : మండలంలోని అన్ని గ్రా మాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు డాక్టర్ ప్రతాప్చౌహాన్ తెలిపారు. అలాగే కరోనా లక్షణా లు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 21 : మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, వాడ్యాల, వేముల, మల్లాపూర్, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికెళ్లి జ్వర సర్వే నిర్వహించినట్లు స్థానిక పీహెచ్సీ డాక్టర్ వంశీప్రియ తెలిపారు. సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది దేవయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 21 : మండలకేంద్రంతోపాటు కాటవరం, పొన్నకల్ తదితర గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. కాటవరంలో సర్వేను మండల వైద్యాధికారి రాధిక, సీ హెచ్‌వో భాస్కర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, జనవరి 21 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నమోదు చేసుకున్నారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేశారు. దేవరకద్రలో సర్పంచ్ కొండా విజయలక్ష్మి, పంచయతీ కార్యదర్శి సీత్యానాయక్ ఫీవర్ సర్వేను పరిశీలించారు. కౌకుంట్లలో సర్పంచ్ స్వప్నాకిషన్రావు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ వైద్యసిబ్బందితో కలిసి ఇంటింటికెళ్లి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, జనవరి 21 : మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్యసిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. మొత్తం 54 బృందాలుగా ఏర్పడి 2950 కుటుంబాలను సర్వే చేశారు. 64మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి ఐసోలేషన్ కిట్లు అందజేశారు. పలు గ్రామాల్లో ఫీవర్ సర్వేను మండల వైద్యాధికారి హరినాథ్, ఎంపీహెచ్‌ఈవో రాములు పర్యవేక్షించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, అవినాశ్ పాల్గొన్నారు.