ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు పన్ను వసూలులో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే అన్ని జిల్లాలు 90శాతం దాటగా, కరీంనగర్ జిల్లాలో లో 93.93 శాతం వసూలయ్యాయి. ట్యాక్స్‌ల రూపంలో 6.99 కోట్లు, నాన్ట్యాక్స్ల రూపంలో 6.21కోట్లు.. మొత్తం 13.21 కోట్లు సమకూరాయి. గతేడాదితో పోలిస్తే 1.44 కోట్లు అదనంగా వసూలు కాగా, గ్రామాలన్నీ ఆర్థిక పరిపుష్టి దిశగా సాగుతున్నాయి.
కరీంనగర్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో ఇంటి, లైబ్రరీ సెస్ తదితర పన్నుల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 16,93,077 పాత బకాయిలు ఉన్నా యి. ఇందులో 14,98,316 వసూలు చేశా రు. ఇక కొత్త పన్నుల రూపంలో 7,17,27, 365 డిమాండ్ ఉండగా, 6,84,44,936 వసూలు చేశారు. పాత బకాయిలో కొత్త పన్ను లు కలుపుకుని 7,34,20,442 డిమాండ్ ఉండగా, 6,99,43,252 వసూలు చేశారు. అంటే టాక్స్‌ల రూపంలో వచ్చే పన్నులు 95.26 శాతం వసూలయ్యాయి. ఇక పాత బకాయిల్లో 1,94,761 కొత్త పన్నుల్లో 32,82,429 మాత్రమే మిగిలాయి.
నీటి పన్నులు, లైసెన్స్‌లు, నిర్మాణ అనుమతులు మొదలైన నాన్ టాక్స్ల్లో కూడా ఈ ఏడాది పెద్ద మొత్తంలో వసూలయ్యాయి. పాత బకాయిలు 19,42,361 ఉండగా 13,95, 490 సమకూరాయి. ఇక ఈ ఏడాది కొత్త పన్నుల్లో 6,52,85095 డిమాండ్ ఉండగా, 6,07,64,866 వసూలయ్యాయి. పాత బకాయిలు, కొత్త పన్నులు కలుపుకుని మొత్తం 6,72,27,456 డిమాండ్ ఉండగా, 6,21, 60,358 వసూలయ్యాయి. ఈ టాక్స్ల్లో ఇంకా 5,46,871 పాత బకాయిలు, 45, 20,229 చొప్పున 50,67,100 మాత్రమే మిగిలాయి. అంటే నాన్ టాక్స్‌లు ఈ ఏడాది 92.46 శాతం వసూలైనట్లు తెలుస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులకు తోడు పంచాయతీలు పన్నులు వసూలు చేస్తూ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం-2018 వచ్చిన తర్వాత పంచాయతీలకు క్రమం తప్పకుండా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు వస్తున్నాయి. వీటికి తోడుగా స్థానికంగా విధించుకునే ట్యాక్స్, నాన్ టాక్స్‌ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 36,35, 438 పాత బకాయిల నుంచి 28,93,806 వసూలయ్యాయి. కొత్త పన్నుల్లో రావాల్సిన 13,70,12,460 నుంచి 12,92,09,802 చొప్పున మొత్తం డిమాండ్‌లో 14,06,47, 898 నుంచి 13,21,03,608 వచ్చాయి. గ్రామాలు అభివృద్ధి సాధించాలంటే స్థానికంగా పన్నుల రూపంలో వచ్చే నిధులే ఎక్కువ దోహదపడతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్ల ఖర్చు విషయంలో కొన్ని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. కానీ, స్థానికంగా జరిగే పన్నుల వసూళ్లలో మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆర్థిక వెసులుబాటును బట్టి పంచాయతీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది.
కరీంనగర్ జిల్లాలోని 15 రూరల్ మండలాల్లో చిగురుమామిడి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో 98.63 శాతం పన్నులు వసూలు చేశారు. టాక్స్‌లు వంద శాతం వసూలయ్యాయి. ఇక వీణవంక మండలంలో 98.02శాతం, చొప్పదండిలో 97.43, ఇల్లందకుంటలో 96.49, గన్నేరువరంలో 96.69, హుజూరాబాద్‌లో 93.93, జమ్మికుంటలో 93.34, కరీంనగర్ రూరల్‌లో 95.77, కొత్తపల్లిలో 94.03, మానకొండూర్‌లో 95.74, రామడుగులో 94.35, శంకరపట్నం లో 94.70, తిమ్మాపూర్‌లో 97.72, సైదాపూర్‌లో 94.70 చొప్పున వసూలుకాగా 86.47 శాతం వసూలు చేసిన గంగాధర మండలం చివరి స్థానంలో ఉన్నది.