
మహబూబ్నగర్ రూరల్, జనవరి 22 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ అన్నారు. మన్యంకొండ దేవస్థానంలో శనివారం ఆలయ ధర్మకర్త, చైర్మన్ అళహరి మ ధుసూదన్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన పాలకమండలి సమావేశానికి హాజరై మాట్లాడారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్, మొబైల్ టాయిలెట్లతోపా టు అమ్మవారి ఆలయం వద్ద అదనంగా లడ్డూ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తేరు మైదానంలో నిర్మిస్తున్న గదులతోపాటు అమ్మవారి ఆల యం వద్ద నిర్మిస్తున్న కల్యాణమండపం పనులను పరిశీలించారు. మన్యంకొండలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ, ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఈవో శ్రీనివాసరాజు ఉన్నారు.