చేగుంట, ఏప్రిల్ 15: నిరుపేదలను కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతగానో ఆదుకుంటున్నాయని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. నార్సింగిలో కల్యాణ్యలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను గురువారం ఎమ్మెల్యే అందజేశారు. మండల కేంద్రమైన నార్సింగిలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఎనిమిదిమంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. అనంతరం ఐకెపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అనంద్మేరి, ఏపీఎం రుక్మిణి, సీసీ శంకర్, నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్రం అశోక్, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ సత్యనారాయణ, ఆకుల సుజాత, మండల రైతుబంధు అధ్యక్షుడు ఎన్నం లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ శంకర్‌గౌడ్ ఉన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి…
కొనుగోలు కేంద్రాలకు వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని వడియారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా సివిల్ సప్లయి అధికారి శ్రీనివాస్‌రావు, డీపీఎం మో హన్, ఐపీడీ బీమయ్య, ఎంపీడీవో ఉమాదేవి, ఉప తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏఈవో శోభ, సర్పం చ్ వడ్డేపల్లి తిరుమల, ఎంపీటీసీ బక్కి లక్ష్మి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు కాసులబాద్ సిద్దమ్మ, సీసీలు రామస్వామి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
స్కూబా డైవర్‌కు సీల్ టైట్ హగ్.. వీడియో వైరల్
కొవిడ్‌పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ