బొంరాస్‌పేట, అక్టోబరు 5 : అమలులో ఉన్న చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సంధ్యా రాణి అన్నారు. మంగళవారం మండలంలోని తుంకిమెట్లలో న్యాయ సేవలపై నిర్వ హించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశా నుసారం చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. చట్టాలపై అవగాహన లేక నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. పోక్సో చట్టం గురించి అవగాహన పెంచుకోవాలని, మైనర్లపై అఘాయిత్యం జరిగితే రూ.10 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉందని అన్నారు. సివిల్ కేసు లను లోక్ అదాలత్‌లలో రాజీ చేసుకుంటే శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని సంధ్యా రాణి అన్నారు. మూడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చని, దర్యాప్తు అవసరమైన కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వరని అన్నారు. కొడంగల్ కోర్టు న్యా యమూర్తి భాస్కర్ మాట్లాడుతూ అందరికీ న్యాయం చేయాలని రాజ్యాంగంలో ఉందని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడం న్యాయస్థానాల లక్ష్యమని అన్నారు. కోర్టులలో పేదలు ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని అన్నారు. ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు సహ కరిస్తే దోషులకు శిక్ష పడుతుందని అన్నారు. కొడంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు బస్వరాజ్, వెంకటయ్య, శకునప్ప, సంతోష్‌లు పలు చట్టాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, సర్పంచ్ స్వరూప పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలం ఇందరూ పాఠశాలలో…
పెద్దేముల్, అక్టోబర్ 5 : ప్రతి ఒక్కరూ న్యాయ సేవలపైన, చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవీందర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఇందూరు గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు తాం డూరు కోర్టు మెజిస్ట్రేట్ స్వప్న ఆదేశాల మేరకు “మండల న్యాయ సేవాధికార సంస్థ తాండూరు” వారి ఆధ్వర్యంలో న్యాయ సేవలపై అవగాహన సదస్సును నిర్వహించి పలు రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న నేరా లు ఘోరాలపై న్యాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పలు రకాల చట్టాలపై అవగా హన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పాశం రవి కుమార్, కోశాధికారి సుదర్శన్,న్యాయవాదులు సుధాకర్, రజిత, వాణిశ్రీ, అనితా గుప్త, అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు పాల్గొన్నారు.