నిజామాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజకీయాలకు అతీతంగా అమలవుతున్న ‘దళితబంధు’ గొప్ప పథకం. గత ప్రభుత్వాలు ప్రతి పథకాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ ఓట్లతో బేరీజు వేసేవి. సీఎం కేసీఆర్ అలాకాదు. ప్రజలకు ఏది అవసరమో అది చేసి చూపుతున్నారు. ప్రజాధనాన్ని ప్రజలకే ఖర్చు చేసే గొప్ప పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం వర్తిస్తున్నది. దళితుల అభ్యున్నతికోసం అమలు చేస్తున్న ‘దళితబంధు’అద్భుత పథకం.. అంటున్న టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
నమస్తే : నిజామాబాద్ రూరల్‌లో దళితబంధు ప్రక్రియ అమలు ఎంత వరకు వచ్చింది?
బాజిరెడ్డి : దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. దళిత కుటుంబాలపై సమగ్ర సర్వే నిర్వహించాం. నియోజకవర్గంలో వారి జీవన స్థితిగతులపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. గ్రామాల వారీగా కుటుంబాలను ఎంపిక చేసి ఫిబ్రవరి మొదటి వారంలోగా జాబితాను జిల్లా యంత్రాంగానికి అందిస్తాం. ఫిబ్రవరి నెలాఖరులోగా యూనిట్ల మంజూరుకు అవసరమైన ప్రక్రియ పూర్తవుతుం ది. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం నుంచి రూ.10లక్షలు మంజూరయ్యే వరకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
లబ్ధిదారుల ఎంపికలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి?
పైరవీలు, ఒత్తిళ్లకు లొంగకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారుల ఎంపిక చేపట్టాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లో 12వేల 105 దళిత కుటుంబాలున్నాయి. వీరిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 పేద కుటుంబాల కు మొదట ప్రయోజనం చేకూరుతుంది. దశలవారీగా మరిం త మందికి పథకాన్ని వర్తింపజేస్తాం. నేటికీ ఆర్థికంగా చితికిపోతున్న దళిత కుటుంబాలకు దళితబంధు ఆలంబన కానుంది. పేదరికంలో మగ్గిపోతున్న కుటంబాల సంక్షేమమే లక్ష్యంగా తొలి విడుత లబ్ధిదారుల ఎంపిక చేప ట్టాం. దళితులను ఆర్థికంగా పైకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారు. ఈ పథకం విజయవంతం అవుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
దళితబంధు లబ్ధిదారులకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏమిటి?
ప్రభుత్వం అనేక వ్యయప్రయాసాలకోర్చి దళితబంధు పథకాన్ని తీసుకువచ్చింది. తొలి దఫా ఎంపికైన లబ్ధిదారులంతా భవిష్యత్తులో వేలాది దళిత కుటుంబాలకు రోల్ మోడల్‌గా నిలువాలి.. ఆ బాధ్యత వారిపై ఉంది. దళితుల అభ్యున్నతికి సాగుతున్న ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు శ్రమించి ఆర్థికంగా పైకి రావాలి. ప్రభుత్వం అందించే రూ.10లక్షలను రెట్టింపు చేసే దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి. వంద మంది సాధించే విజయమే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుంది. వీరు సాధించే ప్రగతి ఎంతో మందికి ఆలంబన కావాలి.గతంలో మీరు అనేక రుణ పథకాలు చూసి ఉండొచ్చు.
దళితబంధు పథకం చూశాక ఏమనిపిస్తున్నది?
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వందశాతం రాయితీతో అమలవుతోన్న ఏకైక పథకం దళితబంధు మాత్రమే. ఇతర రుణ పథకాలకు దళితబంధుకు ఎలాంటి పోలిక లేదు. గతంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాధారిత పథకాలు తీసుకువచ్చారు. ఇందులో లబ్ధిదారుని వాటా, బ్యాంకు వాటా ఉండేది. 20శాతం రాయితీ కోసం పేదలు అప్పులు చేసి తమ వాటా చెల్లించేది. రుణం చేతికొచ్చే సమయానికి అప్పులు పెరిగి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేది కాదు. బ్యాంకు లింకేజీ కారణంగా బడా వ్యక్తులకే లాభం చేకూరేది. దళితబంధుతో పేదలకు భారీగా ప్రయోజనం ఉంటుంది.
దళిత బంధు అమలుకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి?
వంద యూనిట్లు మొదటగా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. అన్ని మండలాల్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. వందమందికి యూనిట్లు మంజూరైన తర్వాత దశల వారీగా నియోజకవర్గంలోని దళితులందరికీ యూనిట్లు మంజూరవుతాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. అయితే.. క్షేత్ర స్థాయిలో దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు అండగా నిలిచేందుకు కమిటీలు ఏర్పాటవుతాయి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేస్తాం.
లబ్ధిదారులతో సన్నాహాక సమావేశం లాంటిది
ఏమైనా నిర్వహించనున్నారా?
దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు అందించాలనే శ్రద్ధాసక్తులతో ముఖ్యమం త్రి కేసీఆర్ ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి, నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని మండలాలు ఎంపికైన తర్వాత ఇప్పుడు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 100 యూనిట్లు మంజూ రు చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నారు. ఇటువంటి పథకాన్ని గతంలో ఎన్న డూ నేను చూడలేదు. గతంలో ప్రభుత్వ పథకాలకు బ్యాంకులతో లింక్ ఉండేది. ఈ పథకానికి బ్యాంకుల కు సంబంధం లేదు. పూర్తిగా ప్రభుత్వమే మంజూరు చేస్తుంది.
దళితబంధు పథకం అమలు కోసం మీకున్న ప్రణాళికలు ఏమిటి?
నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధా రిత ప్రాంతం. నగరానికి చుట్టూ ఉన్న కొంత ప్రాంతం మాత్రమే పట్టణ ప్రాంతంగా ఉన్నప్పటికీ మెజార్టీ భాగం గ్రామీణ నేపథ్యమే. మా నియోజకవర్గ ప్రజల జీవనాధారం వ్యవసాయం. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అత్యధికులకు వ్యవసాయం ఆధారంగానే యూనిట్లు మంజూరు చేయాలని ఆలోచిస్తున్నాం. వీటి ఆధారంగా లభించే యూనిట్లను వ్యవసాయ, ఉద్యా న శాఖలు సిద్ధం చేస్తున్నాయి. వీటితో పాటు మిగిలిన ఇతర రంగాల యూ నిట్లు సిద్ధం చేస్తున్నప్పటికీ. నిర్ణయాన్ని మాత్రం లబ్ధిదారుకే వదిలేస్తున్నాం. వారికి ఏది ఇష్టమైతే అది చేతికిస్తాం.