నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్యి క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పసుపు ఫింగర్ ఓల్డ్ రకం 775 క్వింటాళ్లు, బ్లాబ్ ఓల్డ్ రకం 340, ఫింగర్ కొత్త రకం 273, బ్లాబ్ కొత్త రకం 323, చుర రకం 69 క్వింటాళ్లు వచ్చింది. ఆయా రకాల పసుపు క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.8వేలకు పైగా ధర పలుకుతున్నదని అధికారులు తెలిపారు.