
తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. సంబురాలు సమీపిస్తున్నాయంటే పక్షంరోజుల ముందునుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అద్దంపట్టేలా ఆడపడుచుల ఆటలు, బతుకమ్మ పాటలతో గ్రామీణ ప్రాంతాలు మార్మోగుతాయి. తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలు నేటి ఎంగిలిపూల అమావాస్యతో ప్రారంభం కానున్నాయి.
విద్యానగర్,ఆక్టోబర్ 5 : పూలతో దేవుడిని కొలి స్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతీ సం ప్రదాయాలకు ప్రతిరూపం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకొంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు మహిళలు ఇష్టంగా వేడుకల్లో పాల్గొంటారు. గునుగు, తంగేడు, కట్ల, తురాయి, బంతి, మం దార ఇలా రకరకాల పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేస్తారు. అమావాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు.
పౌరాణిక నేపథ్యం
ధర్మాంగతుడు అనే చోళ చక్రవర్తి ధక్షణపథాన్ని పాలించేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన భార్య సత్యవతి. ఓ యు ద్ధంలో ఆయన తన రాజ్యాన్ని కోల్పోయి భార్య సత్యవతితో కలిసి అడవులకు వెళ్తాడు. ఆ తర్వాత ఆయన శ్రీ మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తాడు. కొంత కాలానికి లక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరిం చి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతుం ది. తమకు సంతానం లేక బాధ పడుతున్నామ ని, నీవే తమ కూతురిగా జన్మించాలని వేడుకుంటారు. అందుకు శ్రీ మహాలక్ష్మి దేవి సంతోషించి వరాన్ని ప్రసాదిస్తుంది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మి దేవి జన్మిస్తుంది. ఆ బాలికను చూసి మునులు, రుషులు, పండితులు ఎం తో సంతోషించి బతుకమ్మ అని దీవిస్తారు. ఆ నాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ జన్మించిన కొంత కాలానికి ధర్మాంగతుడు తన రాజ్యాన్ని పొందాడు. బతుకమ్మ యు క్త వయస్సుకు వస్తుంది. శ్రీ మహా విష్ణువు చక్రంశకుడు అనే రాజుగా జన్మించి బతుకమ్మను వివాహమాడుతాడు. ఆ దంపతులు సిరిసంపదలతో రాజ్యపాలన చేశారనే పౌరాణిక గాథ ప్రచారంలో ఉన్నది.
పండుగ విశిష్టత..
బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్య మి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకొంటారు. ఈ బతుకమ్మ (గౌరీ ) పండుగ లేదా సద్దు ల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వ స్తుంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖా లు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగరంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకొంటారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
కామారెడ్డి, అక్టోబర్ 5 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతిరూపం బతుకమ్మ వేడుకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కరో నా ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోనందున తగు జాగ్రత్తలతో పండుగను జరుపుకోవాలని కోరారు.
ఆడబిడ్డలకు పండుగ శుభాకాంక్షలు : మంత్రి
వేల్పూర్, అక్టోబర్ 5 : బతకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసిం గ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండుగ కావడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఏటా మహిళలు చీరలు పంపిణీ చేస్తున్నారు.