Trs party|పాలమాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్

శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్‌ను రెండోసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో ఆయన సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు కీలకమన్నారు. గ్రామస్థాయిలో నుంచి పార్టీ బలోపేతంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతమౌతాయని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో పారీ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, నాయకులు గూడల కృష్ణయ్యగౌడ్, రవీందర్‌నాయక్, శ్రావణ్‌కుమార్‌గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, బోద్ధం ఆంజనేయులు, రాజు, జాంగీర్, శివకుమార్, మ్లానాయక్, శ్రీధర్‌గౌడ్, గోపాల్, మురళీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఇదే..
పాలమాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడుగా నరేందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోచన్నగారి రాజు, ఉపాధ్యాక్షులుగా శ్రవణ్‌గౌడ్, కమిటీ సభ్యులుగా మధుసుధన్‌రెడ్డి,బోద్దంరాజు, శ్రీనివాస్‌గౌడ్, ఆంజనేయులు, శ్రీశైలం, గూడెపు యాదయ్య, రంజీత్, మల్లేష్,శివ, గణేష్, శంకర్, శ్రీనులతో పాటు పలువురు ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

