
శ్రీనివాస్‌నగర్ కాలనీలో శ్రావణ మాసం బోనాల సందడి
ఐదుగుళ్ల పోచమ్మను దర్శించుకున్న ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, ఆగస్టు 29: శ్రావణ మాసంలో నిర్వహించే అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్న ఐదుగుళ్ల పోచమ్మ అమ్మవారి బోనా లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా పోచమ్మ ఆలయానికి రంగులు వేసి, పువ్వులతో సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజారులు ప్రత్యేక పూజలు అందించి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. పోతరాజుల విన్యాసాల మధ్య మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. యువకులు పెద్దఎత్తున తొట్టెల ఊరేగింపులు, ఫలారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. యువకులు తొట్టెలను అమ్మవారికి సమర్పించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురంలోని ఐదుగుళ్ల పోచ మ్మ బోనాల ఉత్సవాల్లో ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్పొరేటర్ పుష్పానగేశ్, ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖులకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బోనాల పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అన్ని మ తాల ప్రార్థన మందిరాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. పోచమ్మ ఆలయ అభివృద్ధి తమ సహకారం ఎప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ కార్పొరేటర్ అం జయ్య, డివిజన్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కరికె సత్యనారాయణ, రమేశ్ యా దవ్, మల్లేశ్, ఐల్లేశ్, ఎల్లయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, సుచరితకొమురయ్య, మాజీ సర్పంచ్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనోహరాబాద్, ఆగస్టు 29 : మనోహరాబాద్ స్టేషన్ వద్ద జరిగిన బోనాల జాతరలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవులు నిర్వహించిన పస్క పండుగకు హాజరయ్యారు.