
కొల్చారం, ఆగస్టు 28: మండల వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో శనివారం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున అన్ని విద్యాసంస్థలను శానిటేషన్ చేయడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి వసతి పునరుద్ధరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం జడ్పీ సీఈవో మండలంలో పర్యటించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెలాఖరులోపు శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం మండల వ్యాప్త ంగా అన్ని గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ సిబ్బందితో శానిటేషన్ పనులను ముమ్మరం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం కోసం సిద్ధం కావాలని కొల్చారం ఎంఈవో నీలకంఠం ఉపాధ్యాయులకు సూచించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎంఈవోతో పాటు ఎంపీడీవో ప్రవీణ్ (జూమ్) సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడు తూ ప్రతి విద్యార్థి భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌ను తప్పకుండా ధరించేలా చూడాలని సూచించారు. కొల్చారంలోని జడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలను ఎంఈవో పరిశీలించారు.
రామాయంపేటలో…
రామాయంపేట, ఆగస్టు 28: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ వహిం చి శుభ్రంగా ఉంచాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలికల పాఠశాల, తెలంగాణ గురుకుల పాఠశాలలను పరిశీలించి పారిశుధ్య కార్మికులతో చెత్త, పిచ్చి మొక్కలను తొలిగింపజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్లను అందజేశారు. చైర్మన్ వెంట మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బొర్ర అనిల్‌కుమార్, సుందర్‌సింగ్, ప్రిన్సిపాల్ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిచ్చి మొక్కలను తొలిగించడంతో పాటు హరితహారం మొక్కలను కాపాడుకోవాలని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఇన్చార్జి ఎంపీడీవో గిరిజారాణి, జడ్పీటీసీ సంధ్య అన్నారు. మండలంలోని కాట్రియాల, దంతెపల్లి, కిషన్ నాయక్ గిరిజన తండా పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి హరితహారం మొక్కలను పరిశీలించారు.సెప్టెంబర్ 1న పా ఠశాలలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని విద్యార్థులకు భౌతిక దూరం పాటించి పాఠాలు చెప్పాలన్నారు.ఎంపీపీ వెంట సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సురేధ , బుజ్జి, మైలారం శ్యాములు, సుభాశ్ నాయక్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్, పాఠశాల హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.
చిలిపిచెడ్‌లో..
చిలిపిచెడ్, ఆగస్టు 28: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నందున ఈ నెల 31 వరకు అన్ని ఏర్పాట్లును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విఠల్ సూచించారు.మండలంలోని చం డూర్, చిట్కుల్, గౌతాపూర్ తదితర గ్రామాల్లో పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించి, మాస్క్‌ల ను ధరించేలా చూడాలన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, కార్మికులు పాల్గొన్నారు.