
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: వచ్చే నెల 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని వసతి గృహల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పర్యవేక్షించారు. తరగతి గదులను శుభ్రంతో పాటు శానిటైజేషన్ చేశారు. పాఠశాలల ఆవరణలో కలుపు మొక్కలను తొలిగించి శుభ్రం చేస్తున్నారు.కమిషనర్ వెంట మున్సిపల్ డీఈ మహేశ్, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.
పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీపీ
హవేళిఘనపూర్, ఆగస్టు 28: సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలో సర్పంచ్‌లు బాధ్యతతో శుభ్రంగా చే యించాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరినారాయణరెడ్డి అన్నారు. హవేళీఘనపూర్తో పాటు వివిధ గ్రామాల్లో పాఠశాలలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ. పాఠశాల అవరణలోకలుపు మొక్కలు తీసి శుభ్రంగా మార్చలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో నీలకంఠం, సర్పంచ్ సవిత, ఆయా పాఠశాలల హెచ్ఎంలు , టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
మెదక్ రూరల్‌లో…
మెదక్ రూరల్, ఆగస్టు 28: సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్న నేపథ్యం లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ,అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపర్చాలని ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. మెదక్ మండల పరిధిలోని ర్యాలామడుగు, మంబోజిపల్లి ,మాచవర ం ఆయా గ్రామల్లోని , ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులను పరిసరాలను ఎంపీడీవో శ్రీరాములు , పారిశుధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగాఎంపీడీవో శ్రీరాములు మాట్లాడుతూ తరగతి గదులు,తాగునీటి ప్లాంట్‌ను శుభ్రం చేసి శానిటేజేషన్ పను లు చేయించాలని సూచించారు. వారి వెంట ఎంపీవో ,ఉపాధ్యాయులు , సిబ్బంది ఉన్నారు.
వెల్దుర్తిలో…
వెల్దుర్తి, ఆగస్టు 28. పాఠశాలలను ప్రారభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీపీ స్వ రూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ తెలిపారు. వచ్చే నేల 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో వెల్దుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా పాఠశాల, జూనియర్ కళాశాల, హస్తాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపీడీ వో జగదీశ్వరాచారి, మాజీ జడ్పీటీసీ అంజనేయులు, నాయకులు నరేందర్‌లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల పరిశుభ్రత, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు, మధ్యాహ్న భోజనంపై వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కస్తూ ర్బా పాఠశాలలో తాగునీటి శుద్ధ్దిప్లాంట్ మోటర్ చెడిపోయిందని, మరుగుదొడ్ల తలుపులు మరమ్మతులు చేయించాలని కోరగా సర్పంచ్ భాగ్యమ్మ మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలలో 11 మంది అధ్యాపకులకు 6 కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారని, మరో5 మంది గెస్టు లెక్చరర్లు రెన్యూవల్ కావాల్సి ఉందని తెలుపగా, స్పందించిన ఎంపీపీ, జడ్పీటీసీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. వీరివెంట ఎంపీటీసీ బాబు, నాయకులు పాండురంగం, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, మోహన్‌చారి, ప్రిన్పిపాల్ శ్రీనివాస్, ఎస్వో ఫాతీమా, ఉపాధ్యాయులు ఉన్నారు. హస్తాల్‌పూర్‌లో సిబ్బంది తరగతి గదులను శుభ్రం చేస్తుండగా, వెల్దుర్తి కస్తూర్భా పాఠశాల, జూనియర్ కళాశాలలో పంచాయతీ సిబ్బంది హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు.