
పారిశుధ్య పనులపై అధికారుల నిర్లక్ష్యం
జడ్పీ సీఈవో ఆగ్రహం
కొల్చారం, ఆగస్టు 27: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి, శానిటేషన్ చేయించాలని ఎంపీడీవోలు, ఎంపీవోలకు సూచించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని జడ్పీసీఈవో శైలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్చారం, వరిగుంతం పాఠశాలల్లో చేపట్టిన పారిశుధ్య పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వరిగుంతం పాఠశాలలో బురదమయంగా ఉండడం, పాఠశాల కిటికీలు విరిగిపోవడంతో పాటు పురుగు పట్టిన బియ్యం , గదుల్లో చెత్త ఉండడంతో ఎంపీవో కృష్ణవేణిపై సీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల శానిటైజేషన్‌పై ఆరా తీసున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని పాఠశాలలో శానిటైజేషన్ పనులను పర్యవేక్షించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీవో కృష్ణవేణి, సొషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, పంచాయతీ కార్యద ర్శి వెంకటేశ్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
కూకుట్లపల్లి పాఠశాలను పరిశీలించిన జడ్పీ సీఈవో
కౌడిపల్లి ,ఆగస్టు 27:కౌడిపల్లి మండలం కూకుట్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈవో శైలేష్ పరిశీలించారు. రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం తరగతి గదుల్లో ఉండడంతో రెండు రోజుల్లో తీయాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాడిని వెంటనే తీయాలన్నారు. కూకుట్లపల్లి పాఠశాల గదులతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసి, శానిటైజేషన్ చేయాలని సర్పంచ్ సుజాతకాంతారావుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎంపీవో హరిశంకర్, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్
రామాయంపేట, ఆగస్టు 27: ప్రభుత్వ పాఠశాల లు పరిశుభ్రంగా ఉండాలని లేకుంటే కలెక్టర్‌తో ఉపాధ్యాయులు నోటీసులు అందుకోవాల్సి వ స్తుదని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ అన్నారు. మున్సిపల్లోని బాలికల పాఠశాల, గొల్పర్తి, కోమటిపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సందర్శించి పారిశుధ్య కార్మికులతో కలుపు మొక్కలు, గడ్డిని తొలిగింపజేశారు. అనంతరం చైర్మన్, కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు. తరగతి గదుల్లో శానిటైజర్లు, మాస్క్‌లు, భౌతిక దూ రం పాటించాలన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు మల్యాల కవిత, సుందర్‌సింగ్, బొర్ర అనిల్ ఉన్నారు. మం డల పరిధిలోని కాట్రియా లగిరిజన తండాలోని ఉపాధ్యాయులు, సర్ప ంచ్ మైలారం శ్యాములు, ఉపసర్పం చ్ స్రవంతి, పాఠశాల చైర్మన్ సుభాశ్ సర్దార్, కార్యదర్శి ధనలక్ష్మి, చందర్‌నాయక్ ఉన్నారు.
ఎనగండ్ల పాఠశాలను పరిశీలించిన ఎంపీపీ
కొల్చారం, ఆగస్టు 27: పాఠశాలల్లో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఎంపీపీ మంజుల అన్నా రు. మండల పరిధిలోని ఎనగండ్ల పాఠశాలలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ కిషన్‌తో కలిసి తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించా రు.కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్‌లో..
చిలిపిచెడ్, ఆగస్టు 27: సెప్టెంబర్1నుంచి విద్యసంస్థలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నెల 31వవరకు అన్ని ఏర్పాట్లును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విఠల్ సూచించారు. చిలిపిచెడ్, ఫైజాబాద్, సోమక్కపేట, శీలాంపల్లి పాఠశాలలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు,కార్మికులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, ఆగస్టు 27: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో వెల్దుర్తి, మాసాయిపేట మండలాలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లను అధికారులు సిద్ధ్దం చేస్తున్నారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ ఉమ్మడి వెల్దుర్తి మండలంలో 7 ఉన్నత పాఠశాలలు, ఎంపీహెచ్ఎస్ 1, ప్రాథమికోన్నత పాఠశాలలు 10, ప్రాథమిక పాఠశాలలు 29, కస్తూర్బాపాఠశాల 1, వెల్దుర్తిలో బీసీ హాస్టల్‌తో పాటు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కలిపి మొత్తం 49 పాఠశాలలు ఉండగా, 4,898 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలను ప్రా రంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పాఠశాల గదులతో పాటు ఆవరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తుండగా, పాఠశాలలను అన్నింటిని శానిటేజేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అందిం చే మధ్యాహ్న భోజనం కోసం కొత్త బియ్యం సరఫరా కోసం అధికారులకు నివేదికలను పంపించినట్లు ఎంఈవో యాదగిరి తెలిపారు.
చేగుంటలో..
చేగుంట,ఆగస్టు 27: పాఠశాలలను శుభ్రంగాఉంచుకోవాలని నార్సింగి ఏవో, పెద్దతండా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి యాదగిరి అన్నారు. 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. జెప్తిశివునూర్లోని ఎస్సీ కాలనీలోని పాఠశాల ఆవరణ లో సర్పంచ్ ఎండీ షరీప్ కలుపు మొక్కలను తొలిగింపజేశారు.