
మనోహరాబాద్, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్‌తో గ్రామాల అభివృద్ధి సాధ్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం దొంతిలో రూ. 7 లక్షలతో నిర్మించిన బీసీ ముదిరాజ్ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం రూ. 15 లక్షలతో అంతర్గత మురు గు కాల్వలు, ఎంపీ నిధులు రూ. 2.5 లక్షలతో నిర్మించే బస్‌షెల్టర్‌కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే నర్సాపూర్ నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు. డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, నర్సరీ, కమ్యూనిటీ భవనాలు, అంతర్గత మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్‌భగీరథ, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం మొక్కలతో పాటు సకల సౌకర్యాలతో పట్టణాలను తలదన్నే విధంగా గ్రామాలు తయారవుతున్నాయన్నారు.త్వరలోనే కాళేశ్వ రం జలాలు శివ్వంపేట మండలంలో పరుగులు తీయనున్నాయన్నారు. అనంతరం గ్రామస్తుల కోరిక మేరకు దొం తి బస్టాండ్ నుంచి గాంధీ బొమ్మ వర కు, నర్సాపూర్ రోడ్డు నుంచి వీరభద్ర దేవాలయం వరకు డబుల్‌రోడ్డు , సబ్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జ డ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, గ్రం థాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల కో ఆప్షన్ మెంబర్ లా యక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మీకుమార్, సత్తిరెడ్డి, సర్పంచ్‌లు ఫణిశశాంక్, అర్జున్, బా బు రావు, నాయకులు కైఫ్, మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
మన్నెవారి జలాల్పూర్లోబోనాల పండుగ
వెల్దుర్తి, సెప్టెంబర్ 5. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం బోనాల పండుగ అనిఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శ్రావణమాసం చివరి ఆదివారం పురస్కరించుకొని మండలంలోని మన్నెవారి జలాల్పూర్లో గ్రామదేవతలైన పోచమ్మ, దుర్గమ్మలకు బోనాలు ఊరేగించగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ లత గ్రామంలో పెద్దసంఖ్యలో యు వత ఉందని యువజన సంఘం భవనంతో పాటు కమ్యూనిటీ హాల్, కట్టుకాల్వ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశా రు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 5 లక్షలను వెంటనే మంజూరు చేస్తానని, యవజన సంఘం భవనంతో పాటు కట్టుకాల్వ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపించి త్వరలోనే మంజూరు చేయిస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మన్సూర్, నాయకులు నరేందర్‌రెడ్డి, కృష్ణ, ఖా జా, యాదాగౌడ్ , యవకులు, గ్రామస్తులు ఉన్నారు.