
చిన్నశంకరంపేట అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్/హవేళీఘనపూర్ /మెదక్ మున్సిపాలిటీ/టేక్మాల్, సెప్టెంబర్ 2 : ప్రత్యేక రాష్ట్రం కోసం 20 ఏండ్ల క్రితం టీఆర్ఎస్ ఆవిర్భవించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం టీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన మెదక్‌లో అంగరంగవైభవంగా నిర్వహించారు. పట్టణంలోని చమన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండావిష్కరణను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రా పాలకుల అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.
పునరంకితమై పనిచేస్తాం..
నియోజకవర్గంలో పునరంకితమై పనిచేస్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్ణణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు ఎంపీపీలు , సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే పద్మాదే వేందర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు , ఎంపీటీసీలు, జెండాను ఆవిష్కరించారు.
జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జెండా పం డుగను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ 19వ వార్డులో, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ 30వ వార్డులో పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు గాయత్రి, కృష్ణారెడ్డి, జయరాజ్, కిశోర్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లిలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జెండా పండుగలో పాల్గొన్నారు.
మండల కేంద్రమైన టేక్మాల్‌లో మండల పార్టీ అధ్యక్షుడు వీరప్ప పార్టీ జెండాను ఆ విష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు యూసుఫ్, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి అవినాశ్, సర్పంచ్ సుప్రజాభాస్కర్, ఉన్నారు.