
శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్పూర్, సెప్టెంబర్ 1 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలో కౌన్సిలర్లు ఎడ్ల రమేశ్, సంధ్య దంపతుల అధ్వర్యంలో పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ, పోతరాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిపక్వ ఆలోచనలు, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న ఎడ్ల రమేశ్, సంధ్య దంపతులను వారు అభినందించారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యేను సత్కరించారు. కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌గౌడ్ పూజలు చేశారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, రాజు, రమేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ
అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని మైత్రి విల్లాస్‌లో నిర్వహించిన సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.13 లక్షల విరాళం అందజేశారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, టీఆర్ఎస్ నాయకులు రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.