
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు
వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
మహబూబ్‌నగర్, మార్చి30: అందరికీ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం వీసీ ద్వారా హైదరాబాద్ నుంచి కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో మాట్లాడారు. కరోనా నివారణ చర్యలు తప్పకుండా పాటించాలన్నారు. ర్యాలీలు, సమావేశాలకు పూర్తిస్థాయిలో అనుమతులను నిరాకరించామన్నారు. కరోనా నివారణే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని తెలిపారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం ద్వారా రైతులకు మార్కెట్లలో కొనుగోళ్లు లేకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి భారమైనప్పటికీ రైతులకు మేలు చేయాలనే తపనతో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీతారామరావు, తేజస్ నందలాల్‌పవర్, డీఆర్వో కె.స్వర్ణలత, డీఆర్డీవో వెంకట్‌రెడ్డి ఉన్నారు.