
కల్వకుర్తి రూరల్, జనవరి 30 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శనీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీలతో పాటుగా ఆరు మండలాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, దళిత సంఘాల నాయకులతో దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించాక రాష్ర్టాన్ని ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమంతో రాష్ర్టాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని తెలిపారు. 70 ఏండ్ల చరిత్రలో ఏ ప్రధాని, ఏ సీఎం దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ దళితబంధు వంటి పథకాన్ని అమలు చేయలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటుగా దళితులు ఆర్థికంగా.. ఉన్నతంగా ఎదగాలనే కాంక్షతో సీఎం దళితబంధు పథకం అమలుకు శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రామాల్లో అర్హులైన దళితులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గానికి వంద యూనిట్లతోపాటు చారకొండ మండలానికి 1500 మూనిట్లు ఎంపిక చేశారని తెలిపారు. పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం దశల వారీగా కొనసాగుతున్నదన్నారు. విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం పలువురు ఎస్సీ సెల్ నాయకులు పథకం అమలుపై వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఏఎస్ డబ్ల్యూవో లావణ్య, హెచ్‌డబ్ల్యూవో రాధాకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి పట్టణాధ్యక్షుడు బావండ్ల మధు, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ, ఎస్సీ సెల్ కన్వీనర్లు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.