
బాలానగర్, సెప్టెంబర్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్ఎస్కే ప్రజాదరణ లభిస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం హైదారాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో బాలానగర్ మండలం ఊటకుంటతండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు 10మంది సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు పథకాలు అందుతున్నాయ ని వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆ కర్షితులై అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి రావ డం శుభపరిణామమన్నారు. అనంతరం ఊటకుంటతండా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పురందాస్నాయక్ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, శ్రీనునాయక్, రవినాయక్, వాల్యానాయక్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 29 : మున్సిపాలిటీలోని బూరెడ్డిపల్లికి చెందిన గూళ్ల సురేశ్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.50లక్షలు చెక్కును జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి సురేశ్ ధన్యవాదాలు తెలిపా రు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షు డు దశరథ్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, మృత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కోట్ల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.