
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యార రేణుక
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 : అత్యధికంగా ప్రజలు న్యాయంకోసం గ్రామాల నుంచి కోర్టుకు రాలేకపోతున్న దృష్ట్యా గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యార రేణుక అన్నారు. బుధవారం జిల్లా కోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్ కే సులు, కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మండల, గ్రామస్థాయిలో పోస్టాఫీసుల దగ్గర లీగల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల నుంచి కోర్టుకు రాలేనివారికి గ్రా మస్థాయిలోనే న్యాయపరమైన సేవలు ల భించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నామని, వారు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవసరమైన న్యాయసేవలు అందించడానికి కృషి చేస్తారన్నారు. బృందాలు గ్రామాలకు వచ్చే ముం దు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందిస్తారని, రెండు, మూడు గ్రామాల ప్రజలు ఒకేచోటకు వచ్చి సమస్యలను పరిష్కరించుకునేలా చూస్తామన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అక్టోబర్ 2నుంచి నవంబర్ 14వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా జడ్జి ఎస్ ప్రేమావతి మా ట్లాడుతూ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అందించే సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ర ఘురాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సంధ్యారాణి, డీఎంహెచ్‌వో డాక్ట ర్ కృష్ణ, డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు.