
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 5: మహిళలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను అందజేసినట్లు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పేర్కొన్నారు. పట్టణంలోని భగీరథకాలనీ, షాసాబ్‌గుట్ట, సద్దలగుండు, టీడీగుట్ట, రాజేంద్రనగర్, 16వ వార్డులో మంగళవారం మున్సిపల్ చైర్మన్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. 40వ వార్డు షాసాబ్‌గుట్ట దర్గా వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్‌ఇసాక్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు స్వప్న, రమాదేవి, మోతీలాల్, నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, శరత్చంద్ర, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, అక్టోబర్ 5: మండలంలోని ధర్మాపూర్, చౌదర్పల్లి, ఇప్పలపల్లి, గాజులపేట, మాచన్పల్లితం డా, వెంకటాపూర్, రేగడిగడ్డతండాలో మంగళవారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ సభ్యుడు యాదయ్య, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, వెంకటయ్య, శంకరమ్మ, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, రూరల్ తాసిల్దార్ పాండు, జెడ్పీటీసీ వెంకటేశ్వమ్మ, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 5: మహిళలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను అందజేసినట్లు బీబీనగర్ సర్పంచ్ గోవింద్‌నాయక్ పేర్కొన్నారు. మండలంలోని బీబీనగర్ పంచాయతీలో మంగళవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దసరా పండుగ సందర్భంగా చీరెల పంపిణీ చేసున్నదని తెలిపారు. కుచ్చర్కల్లో సర్పంచ్ సుధారాణి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అలీ, విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు విజయ్ రాథోడ్, బాలునాయక్, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 5: ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ చీరె అని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మల్లాపూర్, చిల్వేర్, మిడ్జిల్‌లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సంయుక్తరాణి, రాధికరెడ్డి పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ అక్టోబర్ 5: మండలంలోని కానుగుబండ తండాలో మంగళవారం సర్పంచ్ కవిత బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సీతాబాయి, అంగన్వాడీ టీచర్లు దీపిక, గంగాబాయి, అనిత, శారద, బుక్‌కీపర్ రాములు, కార్యదర్శి నిఖిల్, నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, అక్టోబర్ 5: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా అందజేస్తున్న బతుకమ్మ చీరెలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ పేర్కొన్నారు. మండలంలోని తున్కినీపూర్, వేముల, సంకలమద్ది గ్రామాల్లో మంగళవారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతీకొండయ్య, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచులు లక్ష్మణ్, అరుణారఘుపతిరెడ్డి, స్వరూప, ఎంపీటీసీలు పల్లవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, నాయకులు కొండయ్య, రవీందర్‌గౌడ్, కృష్ణయ్య, ఏపీఎం విష్ణుచారి, సీసీలు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 5: మండలంలోని శాఖాపూర్‌లో మంగళవారం సర్పంచ్ జయన్నగౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, నాయబ్ తాసిల్దార్ శ్రీనివాసులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, అక్టోబర్ 5: మండలంలోని కొత్తపేట, దాచక్‌పల్లి, ఇబ్రహీంబాద్, హన్వాడలో మంగళవారం ఆయా గ్రామాల సర్పంచులు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్‌రాజు, సర్పంచులు వసంత, కృష్ణారెడ్డి, చెన్నమ్మ సరస్వతి, ఎంపీటీసీ అరుణ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 5: ఆడపడుచులకు కానుకగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందజేస్తున్నారని సింగిల్‌విండో డైరెక్టర్ మంజునాయక్ పేర్కొన్నారు. మండలంలోని ఊటుకుంటతండాలో మంగళవారం సర్పంచ్ లలితామంజునాయక్తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, నాయకులు పాల్గొన్నారు.