
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే హరిత నిధి.. కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం ప్రకటనను ప్రజలు స్వాగతించారు. పచ్చదనం పెంపునకు నేను సైతం అంటూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంతో ఉమ్మడి జిల్లా పచ్చలహారంగా మారగా.. గ్రీన్ ఫండ్ భవితకు మరింత పెన్నిధి కానున్నది. ఇప్పటికే గ్రీన్ ఫండ్‌కు అశేష
మహబూబ్‌నగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చదనంతోనే మనిషి జీవితం. మనుగడ కొనసాగాలన్నా, భావితరాలు భద్రంగా ఉండాలన్నా పచ్చదనమే ప్రధానం. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం ఏడేండ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, విద్యార్థి నుంచి పింఛన్ దారుడి వరకు ఈ యజ్ఞంలో భాగస్వామ్యం చేస్తున్నారు. పైసలెన్ని ఇచ్చామన్నది ముఖ్యం కాదని, ఈ పచ్చనికార్యంలో తమ పాత్ర కూడా ఉందని భావన కలిగించడమే హరిత నిధి సంకల్పం. ఈ బృహత్ కార్యంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
హరితనిధి చాలా మంచి కార్యక్రమం..
హరితనిధి ఏర్పాటు చేయడం సంతోషదాయకం. ఈ నిధి వల్ల మొక్కల సంరక్షణ కోసం ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లు పోయడం, చుట్టూ కంచె ఏర్పాటు, మొక్కల సంరక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేసేందుకు అవకాశం ఉంటుంది. గతంలో మొక్కలు నాటి వదిలేసేవారు. తెలంగాణ వచ్చాక చాలా మార్పు వచ్చింది. ఈ హరితనిధి ద్వారా దేశంలోనే అత్యధికంగా అటవీ ప్రాంతం ఉండే రాష్ట్రంగా తెలంగాణ మార్పు చెందే అవకాశం ఉంది. హరిత నిధి, హరిత సంకల్పంపై విద్యార్థులకు
పెద్ద ఎత్తున కల్పిస్తాం. విద్యార్థులు చిన్నప్పటి నుంచే మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా వారిని ప్రోత్సహిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటాలి..
దేశంలో అత్యంత ఎక్కువగా అడవులను పెంచుతున్న రాష్ట్రం తెలంగాణ కావడం సంతోషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 నుంచి 7 శాతం వరకు అడవులను పెంచడం చాలా గొప్ప విషయం. హరితహారం వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నదో.. అదే స్థాయిలో హరితహారానికీ ఇ వ్వడం విశేషం. కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణానికిగానూ భారీగా సేకరించిన నీటి పారుదల శాఖ భూ ముల్లో పెద్ద ఎత్తున హరితహారం కింద మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. హరితనిధి వం టి ఓ మంచి కార్యక్రమం కోసం మా జీతంలో కొం త మొత్తాన్ని కేటాయిస్తున్నందునకు సంతోషపడుతున్న.