
మహబూబ్‌నగర్, అక్టోబర్ 4: పది మందికి సేవ చేయాలనే సంకల్పంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పించడంతోపాటు నిధులు ఖర్చు చేయడం అభినందనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌కు సంబంధించిన యూ వీ కెన్ ఫౌండేషన్ సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో అత్యాధునిక ఐసీయూ బెడ్లు, 50 క్రిటికల్ కేర్ బెడ్లతోపాటు రూ.కోటి విలువైన అత్యవసర వైద్య పరికరాలను సమకూర్చారు. క్రిటికల్ కేర్ బెడ్లను ప్రారంభించాలని ఫౌండేషన్ హెడ్ సృజన్‌కుమార్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సోమవారం హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. త్వరలోనే ప్రారంభించుకుందామని మంత్రి తెలిపారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఆధునిక వైద్యం అందించాలని పరికరాలు సమకూర్చిన క్రికెటర్ యువరాజ్‌సింగ్, ఫౌండేషన్ సభ్యులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వెంకటేశ్, ప్రసన్న, చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.