
మహబూబ్‌నగర్, అక్టోబర్ 3 : ఉద్యోగుల సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశాని కి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రా ష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ఉపాధ్యాయులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. వా రి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీ సుకుంటామన్నారు. అనంతరం ఉద్యమంలో జరిగిన పలు అంశాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. తర్వాత మం త్రి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి జ్ఞాపికలను అందించి సన్మానించారు. అలాగే పిల్లలమర్రి చౌరస్తా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. పాలమూరులో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నా రు. జరిగే పనులు తలమానికంగా ఉండాలని, ఎక్కడా ఎ లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. జంక్షన్ల అభివృద్ధి పూర్తిస్థాయిలో వేగంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీజేపీ సీనియర్ నేత పడాకుల రాంచంద్ర య్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి అతడి ఇంటికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం
ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించడంతోనే దేశ భవిష్యత్తుకు అవసరమైన భావితరాల ప్రయోజకులను తయారు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పద్మావతి కాలనీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విద్యాభివృద్ధి వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అధికారులు, పీఆర్టీయూ నేతలు రఘురాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, అశ్విని చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నేత హేమచంద్రుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దసరాను ఘనంగా నిర్వహిద్దాం
దసరా పండుగను వైభవంగా జరుపుకొందామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలోని ఆర్య సమాజ్ దయానంద విద్యామందిర్‌లో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందజేశారు. గడిచిన రోజుల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోలేకపోయామని అన్నారు. ఈ ఏడాది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుందామన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్‌రావు, కార్యదర్శి ముత్యాల ప్రకాశ్, కోశాధికారి జేపీఎన్సీఈ రవికుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, బుర్జు రాజేందర్‌రెడ్డి, బుర్జు సుధాకర్‌రెడ్డి, నల్లమద్ది సురేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, చెరుకుపల్లి రాజేశ్వర్, సుదీప్‌రెడ్డి, రామాంజనేయులు, గౌలీవీరు తదితరులు పాల్గొన్నారు.