
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 3 : అధునాతన వ్యవసాయ విధానంపై రైతుల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వం రైతువేదికలను నిర్మించిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో రైతువేదికను ప్రారంభించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ లాభదాయక పంటల సాగుపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులపై ఉందన్నారు. వారంరోజులకోసారి రైతువేదికల్లో అన్నదాతలు సమావేశమై దేశం, విదేశాల్లో అనుసరిస్తున్న వ్యవసాయ సాంకేతిక పద్ధతులను తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 38 రైతువేదికలను నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరువతో కోయిల్‌సాగర్ నుంచి రామన్‌పాడు వరకు నిర్మించిన 9 చెక్‌డ్యాంలతో ఎడారిలా ఉండే వాగు జీవనదిలా మారిందన్నారు. అలాగే రూ.54కోట్లతో పేరూర్ లిఫ్ట్ మంజూరైందని తెలిపారు. ఈ లిఫ్ట్‌తో అమ్మాపూర్ శివారు పొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అమ్మాపూర్‌లో వడ్డెర సంఘం, వాల్మీకి సంఘం కమ్యూనిటీ భవనాలకు రూ.4లక్షల చొప్పున మంజూరైన నిధులకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే అమ్మాపూర్‌కు డబుల్బెడ్రూం ఇండ్లు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మం జూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆల ను సర్పంచ్ సులోచనమ్మ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మన్యంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరం
భూత్పూర్, అక్టోబర్ 3 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్‌లో మహబూబ్‌నగర్ మండలం గాజులపేట, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రావులపల్లి బ్రిడ్జి పరిశీలన
మండలంలోని రావులపల్లి బ్రిడ్జిని ఎమ్మెల్యే ఆల పరిశీలించారు. నెలరోజులుగా బ్రిడ్జిపై నెలరోజుల నుంచి నీరు పారురుతుండడంతో పాకర పట్టింది. దీంతో గ్రామస్తులు 10-15మంది బ్రిడ్జిపై జారిపడి గాయపడ్డారు. విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి ఎత్తు పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మండలంలోని తాటికొండ రైతుబంధు సమితి సమన్వయకర్త మన్యం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెం దాడు. మృతుడి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఆల పరామర్శించి రూ.15వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సర్పంచులు సాయికుమార్, వెంకటయ్య, శేఖర్, ఎంపీటీసీలు రజిత, సాయిలు, వెంకటయ్య, పంచాయతీరాజ్ డీఈ రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.