
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 2 : రాష్ట్రంలోని ఆడపడుచులందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నదని ఆబ్కారీ, క్రీ డా శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ మైదానంలో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరెల పంపిణీ చేస్తున్నామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరెలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్ర స్తుతం పాడిపంటలతో కళకళలాడుతున్నదని, అన్ని కులవృత్తు లు, అన్ని వర్గాల వారు సంతోషంగా జీవనం గడుపుతున్నారన్నా రు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నదని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతలకు భ రోసా ఏర్పడిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వివిధ పథకాలు అమలుచేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని, మూడు నె లల్లో టెండర్లు కూడా పిలుస్తామని వెల్లడించారు. ఎంపీ మన్నె శ్రీ నివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, కులవృత్తుల వారు సంతోషంగా ఉన్నారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
మారిన గ్రామాల రూపురేఖలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత గ్రామాల రూపురేఖలు మా రిపోయాయని మంతి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో పల్లెప్రగతి కింద ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎ ంపికైన పల్లెల ప్రజాప్రతినిధులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతిలో గ్రామాల్లో మౌలి క సదుపాయాలు కల్పించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకున్న గ్రామాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. మొదటి ఉత్తమ గ్రామ పంచాయతీకి రూ.15వేలు, రెండో జీపీకి రూ.పది వేలు, మూడో జీపీకి రూ.5 వేలు చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు. అలాగే ఓడీఎఫ్ ఫ్లస్ సాధించిన 12 జీపీలకు అవార్డులు ప్రదానం చేశారు. పల్లెప్రగతిలో భాగంగా మండలాల వారీగా చేపట్టిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ప్రజలు ఐక్యంగా ఉండాలి..
గ్రామాల్లో ప్రజలు ఐకమత్యంతో ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంతి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి సంబంధించి 47 మంది లబ్ధిదారులకు తాసిల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాబార్డ్ నిధు లు విడుదలైనందున గోదాంలు నిర్మాణానికి తక్షణమే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్‌పవార్, సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మ న్ కేసీ నర్సింహులు, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, రైతుబంధు సమితి డైరెక్టర్ నరసింహారెడ్డి, ఆర్డీవో పద్మశ్రీ, తాసిల్దార్ పాండు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు, సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
మహాత్ముడికి నివాళి..
జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో పయనిద్దామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. శనివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు వెంకటేశ్వర కాలనీలో తెలంగాణ పెన్షనర్స్ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ రో జా, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్‌రెడ్డి, చం ద్రనాయక్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయిలుగౌడ్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 2 : జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో ఉన్న రెడ్‌క్రాస్ అనాథాశ్రమంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిత్యావసర స రుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా కార్యదర్శి డా.శామ్యూల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్, కౌన్సిలర్ వనజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి..
హన్వాడ, అక్టోబర్ 2 : ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తు న్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మండల కేంద్రంలో 82 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 159 మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బతుకమ్మ చీరెలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 4.26 కోట్ల చెక్కులు అందజేశామన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులిప్పిస్తామని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీటీసీలు కల్పన, సత్యమ్మ, సర్పంచ్ రేవతి, ఏపీఎం సుదర్శన్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు కరుణాకర్‌గౌడ్, రాజుయాదవ్, లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, రమణారెడ్డి, ఆనంద్, సత్యం, యాదయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.