
మహబూబ్నగర్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు అంటేనే కరువు జిల్లా. వలసల ఖిల్లా అనే విధంగా పరిస్థితి ఉండేది. ఎడారిని తలపించేలా ఉన్న పాలమూరులో పచ్చదనం జాడే ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు ప్రయాణాల కోసం బస్టాండ్ల వద్ద ఎదురుచూసే వారికి నీడనిచ్చేందుకు కనీసం చెట్లే కనిపించేవి కాదు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోటీ పడి అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచనతో రూపుదిద్దుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పచ్చదనం కొత్తపుంతలు తొక్కుతున్నది. గ్రామాల్లోకి వెళ్తే రోడ్లకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. గతంలో వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన అన్నదాతలకు ఇప్పుడు హరితహారం పుణ్యమా అని సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఎండిపోయిన బోర్లు దంచికొడుతున్నాయి. బావులు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 నుంచి 30 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు కేవలం 5 మీటర్ల స్థాయిలోకి వచ్చాయి. ఇవన్నీ హరితహారం ఫలాలే. ఈ ఫలాలు మరింత మధురంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తీసుకొచ్చిన కార్యక్రమమే హరిత నిధి. ఇందులో ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు.. ఒకటో తరగతి విద్యార్థి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థి వరకు అందరూ తమ స్థాయిలో తమ వంతు పాత్ర పోషిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం తమ వంతు బాధ్యత పోషించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సేవల్లోనూ హరిత నిధి చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్లో తెలంగాణ గ్రీన్ తెలంగాణగా మారుతుందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్థోమత ఉన్నోళ్లు ముందుకు రావాలి..
ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని హరితమయంగా మార్చారు. ఇది శాశ్వతంగా కొనసాగేందుకు హరితనిధి ఏర్పాటు చేయాలనే ఆలోచన అద్భుతం. కలెక్టర్ స్థాయిలో మా వంతు పాత్ర కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులతోపాటు విద్యార్థులను సైతం భాగస్వామ్యం చేయడమనేది చక్కని ఆలోచన. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య చదివే వారి వరకు అంతా కూడా ఇప్పుడు హరిత నిధికి తమ వంతు పాత్ర పోషిస్తారు. వారి భాగస్వామ్యంతో హరితహారం కొత్తపుంతలు తొక్కుతుంది. స్థోమత ఉన్న వాళ్లు సైతం హరిత నిధికి తమ వంతు అండగా నిలవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలు హరితహారం కోసం కృషి చేస్తే కూడా బాగుంటుంది.
గ్రీన్ తెలంగాణకే హరిత నిధి..
హరితహారం కార్యక్రమంతో పచ్చదనం పెరిగింది. ఆక్సిజన్ లెవల్స్ ఎంత స్థాయిలో పెరిగాయో చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఎక్కడైతే గాలి బాగుంటుందో అక్కడ రోగాలు తక్కువగా ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వారిని మిగతా వారితో పోల్చిచూస్తే విషయం అర్థం అవుతుంది. అదృష్టవశాత్తు హరితహారం ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయి. గ్రామాలకు వెళ్తే ఒకప్పుడు నీడ కోసం చెట్టు కూడా కనిపించేది కాదు. ఇప్పుడు గ్రామాల్లో పచ్చదనం స్వాగతం పలుకుతున్నది. ఇదంతా హరితహారం పుణ్యమే. హరిత నిధి ద్వారా ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరిగి భవిష్యత్లో ఊహించని విధంగా మార్పు వస్తుంది. గ్రీన్ తెలంగాణకు హరిత నిధి స్ఫూర్తిగా మారుతుంది. ఇంతటి చక్కని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
హరిత నిధి.. అద్భుత ఆలోచన..
దేశంలో అత్యంత వేగంగా పచ్చదనాన్ని పెంచిన రాష్ట్రం తెలంగాణ. ఇదంతా సీఎం కేసీఆర్ ఆలోచనల వల్లే సాధ్యమైంది. హరితహారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 239 కోట్ల మొ క్కలు నాటడం అంటే మామూలు విషయం కాదు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణ చేయడంలో అందరూ తమ వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ హరిత నిధి ఏర్పా టు చేయాలని భావించారు. ఇదో అద్భుత ఆ లోచన. హరిత నిధి ద్వారా రాష్ట్రంలో పచ్చద నం మరింత పెరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామా న్య పౌరులు అందరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తూ హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు హరిత నిధి కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలే మన సీఎం చేస్తా రు. హరిత నిధికి సాధ్యమైనంత మేర ప్రభుత్వానికి అండగా ఉంటాం.
కాలుష్యం తగ్గుతుంది..
హరితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటికే రాష్ట్రమంతా పచ్చదనం భారీగా పెరిగింది. దీంతో కాలుష్యం తగ్గే అవకాశం ఏర్పడింది. ప్ర స్తుతం సీఎం కేసీఆర్ ఆలోచనల ద్వారా రూపుదిద్దుకున్న హరిత నిధితో హరితహారం మరింత విజయవంతమవుతుంది. పచ్చదనం పెంపొందించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. రెండు మూడేండ్లు గా హరితహారం ఫలాలు మనం గమనిస్తున్నాం. భవిష్యత్లో పచ్చదనం మరింత పెరిగి కాలుష్యం తగ్గేందుకు.. పర్యావరణం సమతుల్యతకు అవకాశం వస్తుంది. పచ్చదనం పెరిగితే ప్రాణ వాయువు లెవల్స్ పెరుగుతాయి. ఆరోగ్య తెలంగాణకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ హరితహారంలో తమ వంతు పాత్ర పోషించాలి.
రోల్ మోడల్ ఆలోచన..
హరితహారం ద్వారా పచ్చదనం భారీగా పెరిగింది. ఇప్పుడు హరిత నిధి తీసుకురావడం చాలా అద్భుతమైన ఆలోచన. దేశానికే రోల్ మోడ ల్ వంటిది. ప్రతి మనిషికీ పచ్చదనంపై ఆలోచన వస్తుంది. నేరుగా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మరింతగా విజయవంతం అవుతుంది. దీని ఫలాలు రానున్న తరాలకు దక్కుతాయి. హరిత నిధిలో మా పాత్ర ఉన్నందుకు సంతోషంగా భావిస్తున్నాం. హరితహారం పెంపునకు పరిశ్రమలు, వ్యాపారవేత్తలు సైతం ముందుకు రావాలి.