
జడ్చర్ల/మిడ్జిల్/రాజాపూర్, అక్టోబర్ 2 : అహింసామార్గంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీజీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ పయనించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని గాంధీచౌక్, బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్‌యార్డు, మిడ్జిల్‌లోని మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే జడ్చర్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీజీ జయంతి వేడుకల్లో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. రాజాపూర్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే రా ష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గాం ధీజీ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జంగయ్య, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాదేవి, ఉమాశంకర్‌గౌడ్, బీ జ్యోతికృష్ణారెడ్డి, రాజు, దేవ, లత, చైతన్య, సారిక, రఘురాంగౌడ్, సతీశ్, రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రేణుక, దోరేపల్లి రవీందర్, బీకేఆర్, జీనురాల సత్యం, అంజిబాబు, రామ్మోహన్, హఫీజ్, కిరణ్, మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ, జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచ్ రాధికారెడ్డి, ఎంపీటీసీ గౌస్, రాజాపూర్ ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, మార్కెట్ కమి టీ చైర్మన్ రఘువీరారెడ్డి, సర్పంచుల మండల సం ఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ అ ధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, తాసిల్దార్ శంకర్, ఎం పీడీవో లక్ష్మీదేవి, నరహరి, సత్యయ్య, యాదగిరి, విజయ్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి చేయాలి
l పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
నవాబ్‌పేట, అక్టోబర్ 2 : గాంధీజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బంగారంపల్లిలో సర్పంచ్ లతావెంకటయ్యగౌడ్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అలాగే రుద్రారం, కొండాపూర్, దాయపంతులపల్లి, రాంసింగ్‌తండా, హజిలాపూర్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరెలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, సర్పంచులు లలితమ్మ, బొజ్జమ్మ, లలితమ్మ, నర్సింహానాయక్, గంగమ్మవెంకటేశ్నాయక్ పాల్గొన్నారు.
గాంధీజీ మార్గం అనుసరణీయం
l కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డు ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎన్సీసీ కల్నల్ మిట్టల్వార్, కౌన్సిలర్ ముస్తాక్ష్రీద్, కోఆప్షన్ సభ్యుడు రామలింగం పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా గ్రం థాలయంలో సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పీయూ స్టడీ సర్కిల్లో ప్రిన్సిపాల్ నూర్జహాన్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ గాం ధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ఎదిర 4వ వార్డు రెవెన్యూ కార్యాలయంలో గాంధీజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో హన్మంతు, సూద నర్సింహలు, ఎల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, కృష్ణ, శ్రీనివాసులు, మురళీగౌడ్, రాములు, శేఖర్, అమర్, తిరుపతయ్య, వీరస్వామి, శంకర్, బాలరాజు, చెన్నారెడ్డి, అంజి పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, అక్టోబర్ 2 : మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయా ల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
యువత ఆదర్శంగా తీసుకోవాలి
భూత్పూర్, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో మున్ని, కమిషనర్ నూరుల్‌నజీబ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, వెంకట్రాములు, అశోక్, రామునాయక్, గడ్డం రాములు, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్‌కుమార్, రాకేశ్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్లరూరల్, అక్టోంబర్ 2 : మండలంలోని నసుర్లాబాద్, బూర్గుపల్లి, గంగాపురం, లింగంపేట, కోడ్గల్, ఆలూర్, కిష్టారం తదితర గ్రామాల్లో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 2 : మండలకేంద్రంతోపాటు పెద్దాయపల్లి, ఊటకుంటతండా, వాయిల్‌కుంటతండా, నేరళ్లపల్లి, బోడగుట్టతండా, నా మ్యాతండా తదితర గ్రామాల్లో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ లలితామంజూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 2 : మండలకేంద్రంతోపాటు ముదిరెడ్డిపల్లి, బీబీనగర్, తిర్మలాపూర్, దోండ్లపల్లి, చొక్కంపేట, కుచ్చర్కల్ తదితర గ్రా మాల్లో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా జ రుపుకొన్నారు. తాసిల్దార్, మండల పరిషత్, గ్రా మపంచాయతీ కార్యాలయాల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, మహేశ్వరి, గో వింద్నాయక్, నరహరి, సత్యయ్య, యాదగిరి, వి జయ్, మహిపాల్‌రెడ్డి, రామకృష్ణాగౌడ్ ఉన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, అక్టోబర్ 2 : మండలకేంద్రంతోపాటు మొకర్లాబాద్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యు డు సలీం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, పీఏసీసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, నాయకులు సాబేర్, రంగయ్య, ఆంజనేయులుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, అక్టోబర్ 2 : మండలకేంద్రంతోపాటు కొంరెడ్డిపల్లి, వెన్నాచేడ్ గ్రామాల్లో గాంధీజీ జ యంతి నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు పుల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 2 : దేవరకద్ర, చి న్నచింతకుంట మండలాల్లో మహాత్మాగాంధీ జ యంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సీసీకుంట మండ లం చిన్న వడ్డెమాన్‌లో పంచాయతీ సిబ్బం ది, ఆ శ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను జెడ్పీటీసీ రా జేశ్వరి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ అ న్నపూర్ణ, వైస్‌ఎంపీపీ సుజాత, తాసిల్దార్లు జ్యోతి, సువర్ణరాజు, ఎంపీడీవోలు శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షు లు జెట్టి నర్సింహారెడ్డి, కోట రాము, నాయకులు శ్రీకాంత్యాద వ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
గాంధీజీ కలలు సాకారం
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ కలలను ప్రభుత్వం సాకారం చేస్తున్నదని ఎంపీపీ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పొన్నకల్, కందూరు, శాఖాపూర్, రాచాల, పెద్దమునగల్‌చేడ్, చిన్నముగనల్చేడ్ గ్రామాల్లో గాంధీజీ జయంతిని నిర్వహించారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జానంపేట, నిజాలాపూర్, వేము ల గ్రామాల్లో గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీ పీ గూపని కళావతీకొండయ్య పాల్గొన్నారు.