
జడ్చర్ల, అక్టోబర్ 2: పేదలందరూ ఆనందంగా పండుగలు జరుపుకోవాలనే సర్కారు కానుకలు ఇస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జడ్చర్లలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలకు కానులు అందజేస్తుందన్నారు. చీరెలను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, ఉమాదేవి, ఉమాశంకర్‌గౌడ్, బి.జ్యోతికృష్ణారెడ్డి, రాజు, దేవ, లత, చైతన్య, సారిక, రఘురాంగౌడ్, సతీశ్, రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రేణుక, దోరేపల్లి రవీందర్, బీకేఆర్, జీనురాలసత్యం ఉన్నారు.
రక్తదాన శిబిరం ప్రారంభం
జడ్చర్లలోని సత్యేశ్వర సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ట్రస్టు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టీలు ఈశ్వర్, రామకృష్ణ ఉన్నారు.