
భూత్పూర్, అక్టోబర్ 2 : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. శనివారం మున్సిపాలిటీలోని 3వ వా ర్డు గోప్లాపూర్‌లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అంతుకముందు గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు బతుకమ్మతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ దసరా పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, తాసిల్దార్ చెన్నకిష్టన్న, కమిషనర్ నూరుల్‌నజీబ్, కౌ న్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, కోఆప్షన్ సభ్యులు మల్లమ్మ, అజీజ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సత్యనారాయణ, సాయిలు, రామునాయక్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
గండీడ్/మహ్మదాబాద్, అక్టోబర్ 2 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అ న్నారు. శనివారం గండీడ్, మహ్మదాబాద్ మండలకేంద్రాల్లో బతుకమ్మ చీరెలు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్ ఆంజనేయు లు, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, సర్పంచులు పా ర్వతమ్మ, చంద్రకళ, రాఘవేందర్, ఎంపీటీసీలు బాలయ్య, చెన్నయ్య, మాజీ ఎంపీపీ అలివేలు, అనురాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, బిక్షపతి, గోపాల్‌రెడ్డి, రాంలాల్, రాంచంద్రారెడ్డి, వెంకట య్య, సాబేర్, జోగు కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ లబ్ధి
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 2 : ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎంపీపీ రమాదేవి, చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంటలో బతుకమ్మ చీరెలు పం పిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు అ న్నపూర్ణ, రాజేశ్వరి, పీఏసీసీఎస్ చైర్మన్ న రేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కోటరాము, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారు
ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరె
బాలానగర్ , అక్టోబర్ 2 : ప్రభుత్వం ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరె అందిస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్ అన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో సర్పంచ్ శంకర్‌తో కలిసి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. అలాగే మండలకేంద్రంలో వైస్‌ఎంపీపీ వెం కటాచారి, సర్పంచ్ విజయలక్ష్మి, హేమాజీపూర్, గౌతాపూర్‌లో ఎంపీపీ కమల, స ర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో చీరెలు అందజేశారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు, అధికార ప్ర తినిధి అరుణ్‌కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు, ఆర్ఐ వెంకట్రాములు, ఏపీఎం నాగరాజు, విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక మండల అధ్యక్షుడు మనోహరాచారి, చక్రంచారి, గిరిధర్‌రావు, రవికుమార్, కృష్ణ, సాయిలు, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్లరూరల్, అక్టోబర్ 2 : మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కోడ్గల్‌లో సర్పంచ్ మమత, ఉపసర్పంచ్ రామచంద్రయ్య, గొ ల్లపల్లిలో సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, లింగంపేటలో సర్పంచ్ హైమావతి, మాచారంలో స ర్పంచ్ రవీందర్‌రెడ్డి, నసుర్లాబాద్లో స ర్పంచ్ ప్రణీల్‌చందర్ చేతులమీదుగా మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 2 : మండలకేంద్రంతోపాటు వాడ్యాల్ గ్రామాల్లో సర్పంచులు రాధికారెడ్డి, మంగమ్మ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట,(అడ్డాకుల), అక్టోబర్ 2 : అడ్డాకుల మండలకేంద్రంలో మహిళలకు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయలక్ష్మి, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచ్ మం జులాభీమన్నయాదవ్, ఎంపీటీసీ రంగన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, ఏపీ ఎం సుధీర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్, మహిళా సంఘం అధ్యక్షురాలు నా రాయణమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా మూసాపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీ పీ గూపని కళావతీకొండయ్య బతుకమ్మ చీరెలు అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ మంజుల, ఎంపీవో సరోజ, పంచాయతీ కార్యదర్శి సంతోషి, ఏపీఎం విష్ణుచారి, ఎంపీటీసీ గోవర్ధన్, కోఆప్షన్ సభ్యుడు జమీర్, భాస్కర్‌గౌడ్, శెట్టి శేఖర్, గూపని కొండయ్య, తాజొద్దీన్ పాల్గొన్నారు.