జాతిరత్నాలు సినీ ఫేం, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కోరుట్లలో సందడి చేశారు. పట్టణంలో ఆదివారం ఆనంద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరై అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు.
– కోరుట్ల, ఏప్రిల్ 17
కోరుట్ల పట్టణంలో ఆదివారం సినీ నటి, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆనంద్ షాపింగ్ మాల్‌ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్యతో కలిసి ప్రారంభించారు. షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కస్టమర్లకు సూచించారు. కాగా, అధికసంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్న అభిమానులు అభిమాన నటిని చూసి మురిసిపోయారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, ఎంపీపీ తోట నారాయణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, షాపింగ్‌మాల్ నిర్వాహకుడు చింతకింది హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.