
కరోనా థర్డ్ వేవ్‌ను దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. వైరస్ కట్టడికి ముందస్తుగా చేపట్టిన ఫీవర్ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగింది. గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సర్వే చేపట్టారు. వారికి గ్రామాల్లో పంచాయతీ, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది సహకారం అందించారు. సర్వేలో జ్వర పీడితులకు మందులు పంపిణీ చేశారు.అలాగే కొవిడ్ లక్షణాలున్న వ్యక్తులకు హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేసి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజలు మాస్కులు
లేకుండా బయటకు రావొద్దని సూచించారు. కొవిడ్‌పై పోరుకు సీఎం కేసీఆర్ చేపట్టిన జ్వర సర్వేపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామంలో వైద్య సిబ్బంది తిరుపతిభాయి ఇంటికి వెళ్లారు. మూడు రోజులుగా ఆమె జలుబు, జ్వరంతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. కొవిడ్ లక్షణాలు సైతం కనిపించడంతో కొవిడ్ జాగ్రత్తలు చెప్పి.. పారాసిటమాల్, లివోసిట్రోజిన్, విటమిన్ ట్యాబ్లెట్లు అందజేశారు. జ్వరం తగ్గేవరకు ఇంటి వద్దే ఉండాలని సూచించారు. ప్రతిరోజూ ఇంటికి వచ్చి పరీక్షించి వెళ్తామని ధైర్యం చెప్పారు. జ్వరం తగ్గకుంటే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తామన్నారు. వైద్య సిబ్బందే తమ ఇంటికి వచ్చి మందులు కూడా ఇవ్వడం గొప్ప విషయమని తిరుపతిభాయి చెప్పారు. జ్వరం విషమిస్తే ఆరోగ్య కార్యకర్తకు ఫోన్ చేయాలని నెంబర్ ఇచ్చారని తెలిపారు. ప్రైవేట్‌కు వెళ్తే డబ్బులు ఎంతో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేదని.., కానీ సర్కార్ వైద్య సిబ్బందే ఇంటికి వచ్చి ఉచితంగా మందులు ఇచ్చారని చెప్పారు.
మహబూబ్‌నగర్, జనవరి 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : కరోనా కట్టడిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం ప్రారంభమైంది. గ్రామాల్లో వైద్యాధికారు లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. వీరికి గ్రామాల్లో పంచాయతీ, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది సహకరించారు. ఆరోగ్య సిబ్బంది, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వాములయ్యారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఫీవర్ సర్వేపై ప్రత్యేక దృష్టి సారించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సైతం సర్వేలో పాలుపంచుకున్నారు. ప్ర జలతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కొవిడ్ ప్రబలుతున్న తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేను పరిశీలించారు. సిబ్బందికి సలహాలు, సూచనలు అందించారు. వైద్య సిబ్బందే తమ ఇండ్లకు వచ్చి ఆరోగ్యం గురించి వాకబు చేయడంపై ప్రజలు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. కొవిడ్ వచ్చిన వారికి మందులు అందించడంతోపాటు జాగ్రత్తలు చెబుతున్నారు. అ నుమానం ఉన్న వారికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. హోం ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. లక్షణాలు తీవ్రమైతే సమీపంలోని కొవిడ్ కేర్ సెంటర్ ఉన్న ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు సైతం ఏర్పా ట్లు చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం కొవిడ్ పోరుపై సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.