
జడ్చర్లటౌన్, జనవరి 21 : ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఫీవర్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే చేస్తున్న సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మా స్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షాణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వచ్చే నాలుగు వారాలపాటు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ సునీత, వైస్‌చైర్‌పర్సన్ సారిక తదితరులు పాల్గొన్నారు.