
జడ్చర్ల టౌన్, జనవరి 17 : చోరీల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సాయంగా ఓ ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి త నవంతు బాధ్యతగా ఆటోలో మైకు పెట్టుకొని రాత్రి వేళల్ల్లో కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. చోరీల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నా డు. జడ్చర్ల పట్టణానికి చెందిన షేక్హాజీ ఆ టో డ్రైవర్ ఏడో తరగతి వరకు చదువుకున్నా డు. 20 ఏండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పట్టణంలో చోరీలు చోటుచేసుకుంటున్న నేప థ్యంలో పోలీసు శా ఖ ఆధ్వర్యంలో చోరీలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
అందుకు తనవంతు బాధ్యతగా ప్రతిరో జూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతున్నాడు. రెండున్నర నెలలుగా ప్రతి రోజూ రాత్రి వేళల్లో తన ఆటోను తిప్పుతూ ప్రచారం చేస్తున్నాడు. ఎలాంటి డబ్బులు ఆశించకుండా కేవలం పోలీసు లు పోయిస్తున్న డీజిల్‌తో ఆటో తిప్పుతూ ప్రచారం చేస్తున్నాడు. జీవనోపాధి కోసం ఉదయం వేళల్లో ఆటోనడుపు తూ రాత్రి వేళల్లో సమాజ సేవ కోసం ఆటోను తిప్పుతూ ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ షేక్హాజీని పట్టణవాసులు, పోలీసులు అభినందిస్తున్నారు.
అవగాహన కల్పించేందుకు ప్రచారం..
చోరీలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆటోలో మైకు పెట్టుకొని ప్రచారం చేయాలని పోలీసులు కోరారు. పోలీసు సూచనతోపాటు తన వంతు బాధ్యతగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆటోలో ప్రచారం చేస్తున్నాను. పట్టణంలోని కాలనీల్లో ప్రతిరోజూ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఆటోలో తిరుగుతూ ప్రచారం చేస్తాను. సమాజ సేవ కోసం తాను ఉపయోగపడుతున్ననన్న సంతృప్తి కలుగుతున్నది. పోలీసులు, పట్టణ ప్రజలు అభినందిస్తుండడంతో మరింత ఉత్సాహం వస్తున్నది. పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడంతో పాటు అభినందిస్తున్నారు.