నిర్మల్ టౌన్/ఎదులాపురం, మే 2 : ‘మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దేశించిన గడువులోగా మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాల యంలో జరిగిన వీసీలో అదనపు కలెక్టర్ హేమం త్ బోర్కడే, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లా డుతూ జూన్ 12 కల్లా అన్ని జిల్లాల్లో మన ఊరు-మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో ప్రభుత్వ నిధులతో వసతులు కల్పించాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మా ణం చేపట్టాలని వారు సూచించారు. రూ.30 లక్షల అంచనాతో చేపట్టే పనులను వెంటనే ప్రారంభించి పాఠశాలలు పునఃప్రారంభం లోగా పూర్తిచేయాలన్నారు. రూ.30 లక్షలు ఆ పైన ఖర్చుతో చేపట్టే పనులను ప్రభుత్వ నిబంధలు ప్రకారం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిం చాలని, పాఠశాలల్లో ఆహ్లాదక రమైన వాతావర ణం కల్పించేలా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాల్లో పాఠశాలలు, విడుదలైన నిధుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు.
పరిపాలన అనుమ తులను వెంటనే మంజూరు చేయాలని సూచిం చారు. పాఠశాలల స్థితిగతులను నాడు నేడు ఉన్న మార్పులపై విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన 237 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిం చేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసు కుంటు న్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, డీఆర్డీవో కిషన్, జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, ఇతర అధికారులు, నిర్మల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.