గుడిహత్నూర్, మే 1 : చేపల వేటకు వెళ్లిన బావబామ్మర్దులు.. ఓ యు వకుడిని రక్షించబోయి చెరువులోని లోతైన నీటి గుంటలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్, కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల మేరకు.. తోషం గ్రామానికి చెందిన జాడి రాజేశ్వర్ (45), దుర్గం రమేశ్(40) స్వయానా బావ బామ్మర్దులు. ఆదివారం ఉదయం దుర్గం రమేశ్ కుమారులైన వెంకటేశ్, శివరాజుతో పాటు జాడి రాజేశ్వర్ ఆ గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమం లో వెంకటేశ్ చెరువులోని నీటిగుంటలో పడిపోవడంతో అతన్ని రక్షించేందుకు రాజేశ్వర్, రమేశ్ ఆ నీటి గుంటలోకి దిగారు.
లోతుగా ఉండడంతోపాటు వీరికి ఈత రాకపోవడంతో ఆ యువకున్ని రక్షించే ప్రయత్నం లో నీటిగుంటలో మునిగిపోయారు. వెంకటేశ్ ఎలాగోలా ఈదుకుంటూ బయటకొచ్చి తన తండ్రి, మేనమామ నీటిలో మునిగిపోయిన విషయా న్ని సెల్ ద్వారా తల్లికి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పాతాళ గరిగ స హాయంతో మృతదేహాలను బయటకు తీశారు. జాడి రాజేశ్వర్ భార్య ప దేండ్ల క్రితం చనిపోగా.. వారికి ఒక కుమారుడు, కూతురు ఉంది. దుర్గం రమేశ్‌కు భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రలోని మార్చురీకి తరలించించారు.