కాగజ్నగర్టౌన్/మంచిర్యాల అర్బన్/ సిర్పూర్(టీ)/ ఆసిఫాబాద్/ నిర్మల్ అర్బన్/ ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 30 : జవహర్ నవోదయ విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6148 మంది దరఖాస్తు చేసుకోగా 4764 మంది పరీక్షకు హాజర య్యారు.
1384 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 1633 మంది విద్యార్థులకు గాను 1266 హాజరవగా 367 మంది గైర్హాజరయ్యారు. మంచిర్యాలలో 1590 మంది విద్యార్థులకు గాను 1232 హాజరవగా 358 గైర్హాజరయ్యారు. నిర్మల్లో 1710 మందికి గాను 1319 హాజరవగా 391 గైర్హాజరయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1215 మందికి గాను 947 మంది హాజరు, 268 గైర్హాజరైనట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 77.4 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.