ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలుస్తున్నారని, అదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవడం లేదని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, లక్ష్మణచాంద మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. నిర్మల్ మండలంలోని అక్కాపూర్‌లో రూ.50 లక్షలతో నిర్మించనున్న రేణుకామాత ఆలయానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..మొదట్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఢిల్లీలో పోరాటం చేసినా పట్టించుకోకపోవడం శోచ నీయమని పేర్కొన్నారు.
లోకేశ్వరం, ఏప్రిల్ 24 : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మత రాజకీయాలు చేసే బీజేపీ సర్కారు రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మొదట్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన ఢిల్లీలో పోరాటం చేసినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచించి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
లోకేశ్వరం మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని స్థానిక నాయకులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. ముందుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితాభోజన్న, సర్పంచ్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, యూత్ మండలాధ్యక్షుడు కపిల్, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిగంబర్, మండల మాజీ కన్వీనర్ లక్ష్మణ్ రావు, వైస్‌ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, ఏప్రిల్ 24 : రైతులను ఆదుకోవడానికే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రాచాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి చేతులెత్తేసినా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.
నిర్మల్ జిల్లాలో 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్ రాంరెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో శేఖర్, సర్పంచ్ సాతం బొర్రవ్వ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సాతం గంగారాం, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు రమేశ్, నరేశ్‌రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఏప్రిల్ 24 : స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాతే గీత కార్మికులకు న్యాయం జరుగుతుందని మంత్రి
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం అక్కాపూర్ గ్రామంలోని రూ.50 లక్షలతో చేపడుతున్న రేణుకా ఎల్లమ్మ మాత ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ మాత గౌడ కులస్తులకు ఆరాధ్యదైవమని అన్నారు.
ప్రభుత్వం గౌడ కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మద, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ సుజాతాపోశెట్టి, ఎంపీటీసీ శ్రీవాణి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, ముత్యంరెడ్డి, గౌడ సంఘం సభ్యులు జీవన్‌గౌడ్, నర్సాగౌడ్, లింగాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.