రైతులను రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నది. బీడు భూములను సైతం సాగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నది. కాళేశ్వరం ప్యాకేజీ 27 పనులు తుది దశకు చేరుకున్నాయి. ముందుగా ఈ పనుల కోసం రూ. 714 కోట్లు మంజూరు చేశారు. పనులు సకాలంలో పూర్తి చేయక పోవడంతో రెండో సారి మరో రూ. 290 కోట్లు మంజూరు చేసింది తెలంగాణ సర్కారు. దీంతో పనులు వడి వడిగా ముందుకు సాగుతున్నాయి.
– దిలావర్పూర్, ఏప్రిల్ 24
50 వేల ఎకరాలకు పైగా బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. భూములు కోల్పో యిన రైతులకు సర్కారు నష్ట పరిహారం అందిం చింది. నిరూపయోగంగా ఉన్న భూముల్లో సైతం రైతులు పంటలను సాగు చేయవచ్చని అధికా రులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
పనులు ప్రారంభించేందుకు ముందుగా ప్రభు త్వం రూ.750 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మల్ నియోజకవర్గంలోని ప్రధాన కాలువ పనులు 26 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తయ్యాయి. 4.5 కిలోమీటర్ల మేరకు గుట్టల పైకి నీరు వెళ్లేందుకు టన్నల్ పనులు కొంత పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మిగిలి ఉన్న పలు పనులకు గానూ రెండో సారి ప్రభు త్వం రూ. 290 కోట్లను మంజూరు చేసింది. దీంతో మిగిలి ఉన్న పనులు చేపట్టారు.
శ్రీరాంసాగర్ నుంచి సాగునీటి సరఫరా కోసం గుండంపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పంపు హౌస్ పనులు పూర్తయ్యాయి. దీని కోసం కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడి నుంచి గుట్టమీది గ్రామలు కదిలి, మాడెగాంకు టన్నెల్ ద్వారా సాగు నీరు సరఫరా చేయనున్నారు. అక్కడి నుం చి వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.
ప్యాకేజీ 27 పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రధాన కాలువ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో ని 11 చెరువులకు జూన్ నాటికి నీటిని అందిం చనున్నారు. అవసరమైన మేరకు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అంద నుంది.
నిర్మల్ జిల్లాలోని ప్యాకేజీ 27, 28 పనులతో పాటు సదర్మాట్ పనులపై 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని అరణ్య భవన్ నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ పను లు ఈ దసరా నాటికి పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.