తలమడుగు, ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ హ యాంలోనే ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పల్లి(కే) గ్రామంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డికి శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సమావేశంలో వారు పాల్గొన్నారు.
గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడూతూ.. దేశంలో ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. రైతు బీమా, రైతు బంధు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పల్లి గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డిని గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ రమేశ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జీవన్‌రెడ్డి, నాయకులు గంగయ్య, కిరణ్, ఈశ్వర్ రెడ్డి, భూమారెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.