
అట్టహాసంగా ప్రారంభమైన ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలు
ఆలయానికి చేరిన ఉత్సవమూర్తి
ఊర్కొండ, జనవరి 29 : మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గ్రామంలోని అర్చకుల స్వగృహం నుంచి మంగళవాయిద్యాల మధ్య, భక్తుల భజనలతో ఉత్సవమూర్త్తి విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చారు. పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. ఎంపీపీ బక్కరాధ జెండా ఊపి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మొదటిరోజు ఉత్సవాల్లో భాగంగా వైభవంగా శకటోత్సవం నిర్వహించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను అందంగా ముస్తాబుచేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆల య పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్వకుర్తి సీఐ సై దులు నేతృత్వంలో భద్రత కల్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ అనిత, కో ఆ ప్షన్ ఖలీంపాషా, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు కళమ్మ, గోపి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, రఘురాములు, చంద్రమోహన్, రామస్వా మి, రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, రంగయ్య, టీఆర్ఎస్ నా యకులు జనార్దన్‌రెడ్డి, గిరినాయక్ తదితరులున్నారు.