
పేట, మక్తల్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు అవాస్తవం
ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదు
చౌకబారు రాజకీయాలొద్దు
బీజేపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలి
టీఆర్ఎస్ నాయకుల హితవు
నారాయణపేట టౌన్, జనవరి 29 : రాయిచూర్ కృష్ణ చెక్‌పోస్ట్ వద్ద లారీలు ఆపిన ఘటనపై బీజేపీ సీనియర్ నా యకుడు కొండయ్య పేట, మక్తల్ ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్ హితవు పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో ఎమ్మెల్యేలను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లా రీల విషయం అధికారులకు సంబంధించిందని పేట ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని, ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలన్నారు. బీజేపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండి శివరాంరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చే స్తుంటే ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అనవసరం గా ఎమ్మెల్యేలపై బురద జల్లేలా మాట్లాడడం సరికాదన్నా రు. కౌన్సిలర్ అమీరుద్దీన్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసునని, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తారన్నారు. సమావేశం లో పార్టీ ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు గురులింగప్ప, మహేశ్, సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, రవికుమార్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలి
మరికల్, జనవరి 29 : పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసి ఓ ప్రైవేట్ న్యూస్ యాప్‌లో న్యూస్‌ను అప్లోడ్ చేసిన వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేట జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకంగా పేట ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఎస్సై అశోక్‌బాబుకు ఫిర్యాదు చేశారు. సమావేశంలో నాయకులు తిరుపతయ్య, చంద్రశేఖర్, శివకుమార్, గోవర్ధన్‌రెడ్డి, రామస్వామి, మతీన్, లక్ష్మయ్య, బసంత్, జగదీశ్, నారాయణ, ప్రవీణ్, నర్సింహులు, సత్తార్, ప్రకాశ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
‘ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఊరుకోం’
ధన్వాడ, జనవరి 29 : పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ మండల నాయకులు హెచ్చరించారు. మండలకేంద్రంలో శనివారం సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎ స్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, కొండరెడ్డి మాట్లాడుతూ పేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యేను కావాలనే ప్రతిపక్ష పార్టీల నాయకులు నాటకమాడుతున్నారని పేర్కొన్నా రు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరమైన విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఇకముందు ఎవరైనా లేని విషయాన్ని రాద్ధ్దాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు సుధీర్‌కుమార్, కడపయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, నాయకులుపాల్గొన్నారు.