e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిల్లాలు చదువులో ఆదర్శంగా

చదువులో ఆదర్శంగా

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఆదర్శ పాఠశాలలు
పోటీ పరీక్షల్లో రాణిస్తున్న విద్యార్థులు
వృత్తి విద్య, ఐటీ, బ్యూటీ, వెల్‌నెస్‌ కోర్సుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
వెలిమెల టీఎస్‌ మోడల్‌ స్కూల్‌లో 822 మంది విద్యార్థులు

రామచంద్రాపురం, నవంబర్‌ 28 : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి పిల్లలు ఎవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూ రం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలను నిర్వహిస్తున్నది. ప్రతిఒక్కరూ బాగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగాలనే సంకల్పంతో ప్రభు త్వం ముందుకుసాగుతున్నది. పేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్‌ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. పదో తరగతి, ఇంటర్‌లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కి దీటుగా ప్రభుత్వ మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణ సాగుతున్నది. ఆరో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకోవచ్చు. మోడల్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం మాత్రమే ఉం టుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉండడంతో స్కూల్‌లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఏటా మోడల్‌ స్కూల్‌ అద్భుత విజయాలు సాధిస్తున్నది. జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌నకు సంబంధించిన పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు సత్తా చాటుతున్నారు.

స్కూల్‌ నేపథ్యం..
2013లో నాటి కేంద్ర ప్రభుత్వం మోడల్‌ స్కూల్స్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అప్పుడు ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామంలో మోడల్‌ స్కూల్‌ను ప్రభుత్వం నిర్మించింది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణ బాధ్యతను తాము తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో పలు రాష్ర్టాల్లో మోడల్‌ స్కూల్స్‌ను మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. తర్వాత స్కూల్స్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి. విశాలమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, టా యిలెట్స్‌, ఆట స్థలం ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వెలిమెలలో మోడల్‌ స్కూల్‌ ప్రారంభమైన మొదట్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు 240, ఇంటర్మీడియట్‌లో 32 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు 502 మంది, ఇంటర్‌లో 320 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలోనే అత్యధికంగా విద్యార్థుల సంఖ్య కలిగిన స్కూల్‌గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డును అందజేశారు. ప్రస్తుతం 2020-21 సంవత్సరానికి ఆ స్కూల్‌లో 822 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

- Advertisement -

పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్న విద్యార్థులు..
టీఎస్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. మోడల్‌ స్కూల్‌ నుంచి ఇప్పటివరకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) స్కాలర్‌షిప్‌నకు 35 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2014-15 జరిగిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఒక్కరు, 2015-16లో ఒక్కరు, 2016-17లో నలుగురు, 2017-18లో 13 మంది, 2018-19లో ఏడుగురు, 2020-21లో 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.12 వేలు ఐదేండ్లపాటు బ్యాంకు ఖాతాలో స్కాలర్‌షిప్‌ జమవుతుంది. ఏటా జాతీయ స్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను నిర్వహిస్తారు. అదేవిధంగా ఐఐఐటీ బాసరకు మోడల్‌ స్కూల్‌ నుంచి 2017-18లో ఒక్కరు, 2018-19లో ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.

ఏటా పెరుగుతున్న ఉత్తీర్ణత..
ఏటా మోడల్‌ స్కూల్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వస్తున్నది. మోడల్‌ స్కూల్‌లో 2015-16లో పదో తరగతి మొదలవ్వడంతో ఆ ఏడాది 95.38 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నది. 2016-17లో 97.59 శాతం, 2017-18లో 94.76 శాతం, 2018-19లో 100, 2020-21లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్‌లో 2015-16లో 56 శాతం, 2016-17లో 77.41, 2017-18లో 83.01 శాతం, 2018 -19లో 76, 2020-21లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రవేశం ఇలా..
మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి 100 సీట్లు ఉంటాయి. ఇంటర్‌లో మొదటి సంవత్సరంలో 160 సీట్లు, రెండో సంవత్సరంలో 160 సీట్లు ఉంటాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు మోడల్‌ స్కూల్‌లో చేరాలనుకుంటే జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మోడల్‌ స్కూల్‌ ఎక్కడైతే ఉంటుందో ఆ మండల విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం సీట్లు ఖాళీగా ఉంటే ఇతరులకు అవకాశం ఇస్తారు. ఇంటర్‌లో మాత్రం పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

స్కూల్‌ ప్రత్యేకతలు..
మోడల్‌ స్కూల్‌కి విశాలమైన క్యాంపెస్‌ ఉంది. విద్యార్థులకు సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, డిజిటల్‌ క్లాస్‌ రూంలు ఉన్నాయి. వృత్తి విద్య, బ్యూటీ, వెల్‌నెస్‌, ఐటీ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అనుభవజ్ఞులైన ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులచే బోధన ఇస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. రెగ్యులర్‌ క్లాసులతోపాటు ఎంసెట్‌, ఐఐటీ, జేఈఈ, నీట్‌లో శిక్షణ ఇస్తున్నారు. వంద మంది బాలికలకు హాస్టల్‌ వసతి ఇస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement