
చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలి
ప్రణాళిక రూపొందించుకోవాలి
నిత్యం పనుల వివరాలు తెలపాలి
సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్
నడిగడ్డను సస్యశ్యామలం చేశాం
ఇతర రాష్ర్టాల నుంచి వలసలు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గద్వాల, జనవరి 28 : ‘చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలి.. 45 రోజుల్లో పూర్తి చేయాలి.. ఇందుకోసం ప్రణాళిక రూపొందించండి.. ప్రతి రోజూ ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేశారో రోజువారీ నివేదిక పంపించాలి. నిర్మాణం పూర్తయ్యాక ఆర్డీఎస్ వరకు ఎన్ని కిలోమీటర్లు కాలువ తవ్వాలో అంచనా వేయాలి.. టెండర్లు పిలవాలి’.. అని సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్‌రావుతో కలిసి ఆమె గట్టు మండలం చిన్నోనిపల్లికి చేరుకున్నారు. అక్కడ చేసున్న, జరగాల్సిన పనులపై ఇరిగేషన్ అధికారులు రఘునాథ్‌రావు, శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని, దీంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడకు వలస వస్తున్నారని తెలిపారు.
గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు శరవేగంగా చేపట్టాలని సీ ఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించా రు. మిగిలిపోయిన పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆమె సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్‌రావుతో కలిసి ఆమె చిన్నోనిపల్లికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులు, జరగాల్సిన ప నులపై ఇరిగేషన్ అధికారులు రఘునాథ్‌రావు, శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. అయితే రిజర్వాయర్ పనులపై అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వస్తున్నానని పనుల వద్దకు వచ్చారు.. కదా అన్నారు. పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారా అని ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం రాలేదు. 15 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, రివిట్మెం ట్ 50 శాతం పెండింగ్‌లో ఉన్నాయని ఆమెకు వివరించారు.
54 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తే పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ప్రతి రోజూ ఎన్ని క్యూబిక్ మీటర్ల పని చే స్తారో.. రోజు వారీ నివేదిక తనకు పంపించాలని సీఈ, ఎస్ఈని ఆదేశించారు. గతంలో పని చేసిన కాంట్రాక్టర్లు ఎందుకు పనులు మధ్యలో వదిలి వెళ్లిపోయారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మంత్రి శ్రీ నివాస్‌గౌడ్, అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలోగా ప నులు ప్రారంభించాలని ఆదేశించారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు వేగంగా చేపట్టే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని సూచించారు. రిజర్వాయర్ పూర్తయిన వెంటనే ఇక్కడ నుంచి ఆర్డీఎస్కు లింక్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఇక్కడి నుంచి ఆర్డీఎస్ వరకు కా లువ ఎన్ని కిలోమీటర్ల పరిధి తవ్వాలో అంచనా వేసి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. రిజర్వాయర్‌కు సంబంధించి అలైన్మెంట్ శనివారం వరకు తమ కు అందించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుం డా వేగంగా చేపట్టి పుణ్యం కట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఫీడర్ చానల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటికి టెండర్లు పిలవాలన్నారు.
రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ లింక్ కాల్వ ఏర్పాటు చేస్తే గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు 12 గ్రామాలకు నీటి వసతి ఏర్పడుతుందని చెప్పారు. భూసంబంధమైనా సమస్యలు ఉంటే ఇ క్కడి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూ చించారు. పునరావాస కేంద్రాలైన ర్యాలంపాడు, ఆలూ రు, గార్లపాడు, ఉప్పేరు తదితర ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిధుల కొరత లేదని.. వేగంగా చేపట్టాలన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ నివేదిక అడిగారని తెలిపారు. పనులు వే గంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పా లమూరు జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. సమావేశంలో సీఈ రఘునాథ్‌రావు, ఎస్ఈ శ్రీనివాస్‌రావు, ఈఈ రహీముద్దీన్, ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ శ్యామల, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తిరుమల్‌రెడ్డి, సీతారామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.